అన్వేషించండి

IAS IPS : ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !

CAT Orders: ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా ఆదేశాలివ్వాలని క్యాట్‌కు వెళ్లిన ఐఏఎస్‌లకు ఊరట లభించలేదు. డీవోపీటీ ఆదేశాల మేరకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

CAT has directed the IAS to follow the orders of DoPT :  ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగాలని ఐదుగురు ఐఏఎస్‌లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. డీవోపీటీ ఆదేశాల మేరకు వారికి కేటాయించిన రాష్ట్రాల క్యాడర్‌లో రిపోర్టు చేయాల్సిందేనని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ స్పష్టం చేసింది. తెలంగాణలో పని చేస్తున్న  అధికారులు ఏపీకి, ఏపీలో పని చేస్తున్న అధికారులను తెలంగాణ క్యాడర్ కు కేటాయించారు. అయితే ఈ కేటాయింపులపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు కేసులు, వాదనల తర్వాత ఎవరికి కేటాయించిన రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని డీవోపీటీ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలని ఐదుగురు క్యాట్‌లో అత్యవసర పిటిషన్లు వేసి వాదనలు వినిపించినా ప్రయోజనం లేకపోయింది.  

డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని క్యాట్ తీర్పు 

తమను ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగించాలని క్యాట్ ఎదుట పిటిషన్లు వేసిన సివిల్ సర్వీస్ అధికారుల తరపు లాయర్లు వాదించారు. ప్రతి ఒక్కరి వాదనలను విన్నారు.ఈ సందర్భంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.  ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు, వారికి సేవచేయాలని లేదా అని ప్రశ్నించారు. ఏసీ గదుల్లోనే కూర్చుని ఎందుకు పని చేయాలనుకుంటున్నరాని ప్రశ్నించారు.  స్థానికత ఉన్నప్పటికీ, స్వాపింగ్‌ చేసుకోవచ్చని గైడ్‌లైన్స్‌లో ఉంటే చూపించాలని క్యాట్  ఐఏఎస్‌ల కేటాయింపుపై డీఓపీటీకి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. వన్‌ మెన్‌ కమిటీ సిఫారసులను డీఓపీటీ ఎలా అమలు చేస్తుందని క్యాట్ ప్రశ్నించింది.  వన్‌ మెన్‌ కమిటీ సిఫారసు చేసినప్పుడు ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదని కూడా క్యాట్ ప్రశ్నించింది.

కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి ! 

ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రాల్లోనే ఉండాలనుకుంటున్న అధికారులు

సుదీర్ఘ వాదనల అనంతరం డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని క్యాట్ స్పష్టం చేసింది. క్యాట్ ఆదేశాల మేరుక ఎనిమిది మంది తెలంగాణ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏపీలో, ముగ్గురు ఏపీకి చెందిన ఐఏఎస్‌లు తెలంగాణలో బుధవారమే రిపోర్టు చేయాల్సి ఉంది. విభజనలో భాగంగా ఏపీకి కేటాయించినా తెలంగాణలోనే పని చేస్తున్న ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు ఇచ్చింది.   రోనాల్డ్ రాస్ , ప్రశాంతి , వాకాటి కరుణ ,  వాణి ప్రసాద్, అమ్రపాలి ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్‌ల జాబితాలో ఉన్నారు.  ఏపీ నుంచి   ఐఎఎస్‌లు ఎస్ ఎస్ రావత్, అనంత్రామ్, సృజన, శివశంకర్, హరికిరణ్ ను రిలీవ్ చేసింది. వీరంతా బుధవారమే కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది.  

అత్తాకోడళ్లపై అత్యాచార కేసులో విస్తుపోయే వాస్తవాలు-నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరిపై 32 కేసులు !

బుధవారం లంచ్ మోషన్ పిటిషన్  దాఖలు చేసే అవకాశం 

అయితే ప్రస్తుతం  పని చేస్తున్న రాష్ట్రాల్లోనే ఉండాలనుకుంటున్న వీరు క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయిచేందుకు రెడీ అవుతున్నారు. పదహారో తేదీనే రిపోర్టు చేయాల్సి ఉంది. ఈ కారణంగా పదహారో తేదీన ఉదయమే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించాలనుకుంటున్నారు. తాత్కలిక ఊరట అయినా లభిస్తే తదుపరి ప్రయత్నాలు చేయవచ్చని అనుకుంటున్నారు. ఒక వేళ ఊరట రాకపోతే వెంటనే ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Shop Timings: ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
IAS IPS : ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
Pusha 2: నార్త్ To సౌత్- నీయవ్వ తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ టీమ్!
నార్త్ To సౌత్- నీయవ్వ తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ టీమ్!
MBBS Candidate : వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరంఫ్రెండ్‌ని కాపాడిన రతన్ టాటా, పచ్చబొట్టు వేసుకున్న వ్యక్తిభారత్‌ కెనడా మధ్య మరోసారి రాజుకున్న వివాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Shop Timings: ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
IAS IPS : ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
Pusha 2: నార్త్ To సౌత్- నీయవ్వ తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ టీమ్!
నార్త్ To సౌత్- నీయవ్వ తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ టీమ్!
MBBS Candidate : వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
Rajnath Singh Comments: వీఎల్​ఎఫ్ రాడార్ స్టేషన్‌తో పర్యావరణానికి ప్రమాదం లేదు- శంకుస్థాపన మీటింగ్‌లో రాజ్‌నాథ్‌సింగ్ భరోసా
వీఎల్​ఎఫ్ రాడార్ స్టేషన్‌తో పర్యావరణానికి ప్రమాదం లేదు- శంకుస్థాపన మీటింగ్‌లో రాజ్‌నాథ్‌సింగ్ భరోసా
Maharashtra Election Schedule : నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
Pawan Kalyan: ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Jharkhand Assembly Elections : జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి మరో అగ్నిపరీక్ష - అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి మరో అగ్నిపరీక్ష - అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
Embed widget