Kurnool news : కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి !
Kurnool : దసరా పండగకు ఫుల్లుగా మందేసి ఓ ఇంటి ముందు కూర్చున్న వ్యక్తిని కొండ చిలువ పట్టేసింది. అయినా అతడికి స్పృహ తెలియలేదు. చివరికి ఏం జరిగిందంటే ?
Viral News : కొండ చిలువు చూస్తేనే ఒళ్ల గగుర్పొడుస్తుంది. ఎందుకంటే అది మనుషుల్ని కూడా మింగేయగలదు. దానికో ప్రాసెస్ పెట్టుకుంటుంది. ముందగా తాను మింగాలనుకున్న జంతువు లేదా మనిషిని చుట్టేస్తుంది. కదలకుండా చేస్తుంది. తర్వాత అమాంతం తన నోరు తెరిచి మింగేస్తుంది. ఇలా ఎదైనా జంతువును చుట్టేసినప్పుడు చూసి చాలా జంతువుల్ని కాపాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూంటాయి. కానీ మనుషుల్ని మాత్రం అరుదుగా కాపాడుతారు. ఎందుకంటే.. కొండ చిలువకు దొరికేంత వరకూ మనుషులు ఎవరూ దరి దాపుల్లో ఉండరు. మద్యం మత్తులో ఉన్న వారు మాత్రం దొరికిపోతారు.
మద్యం తాగి ఓ ఇంటి అరుగుమీద ఉండిపోయిన వ్యక్తి
ఫుల్లుగా మద్యం తాగితే పామేదో.. తాడేదో తెలుసుకోలేరు. ఆ మందుబాబుకీ అదే పరిస్థితి అవుకు మండలం సింగనపల్లికి చెందిన లారీ డ్రైవర్ డ్యూటీ దిగి ఫుల్లుగా మద్యం సేవించాడు. మద్యం బాగా ఎక్కడంతో ఇంటికి వెళ్లలేక.. ఓ చోట అరుగుపై కూర్చున్నాడు. మద్యం మత్తులో తూగుతూ ఉండిపోయాడు. ఇంటి పక్కన చెట్ల పొదలు ఉన్నాయి. బాగా ఆకలిగా ఉందేమో ఓ కొండ చిలువ మంచి ఆహారం దొరికిందని మనోడి మీదకు వచ్చేసింది. మెల్లగా మెత్తం చుట్టేసింది. తనను ఏదో చుట్టేస్తోదంని కూడా తెలుసుకోలని ఆ తాగుబోతు అంతే సైలెంట్ గా ఉన్నాడు. కాసేపు ఉంటే.. మొత్తం నలిపేసి అమాంతం మింగేసేదేమో కానీ.. గ్రామంలో ఒకరు చూడటంతో బయటపడిపోయాడు.
అత్తాకోడళ్లపై అత్యాచార కేసులో విస్తుపోయే వాస్తవాలు-నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరిపై 32 కేసులు !
గ్రామస్తులు చూడడంతో నిలిచిన ప్రాణాలు
గ్రామంలో కొండ చిలువల్ని అక్కడి ప్రజలు చాలా సార్లు చూశారు. అందుకే లారీ డ్రైవర్ ను కొండ చిలువ చుట్టేసినా వారు కంగారు పడలేదు. వెంటనే కట్టెలు తీసుకుని వచ్చి కొండ చిలువను పక్కకు లాగేశారు. అతి కష్టం మీద ఆ కొండ చిలువ లారీ డ్రైవర్ ను వదిలేసి పొదల్లోకి పోయింది. ఇంత జరిగినా ఆ డ్రైవర్ మాత్రం .. స్పృహలోకి రాలేదు. ఆ లారీ డ్రైవర్ ఇల్లు సమీపంలోనే ఉండటంతో తీసుకెళ్లి వదిలి పెట్టారు.
కొండ చిలువ వచ్చి ఒంటిని చుట్టేస్తున్నా స్పృహ తెలియనంతగా ఏ బ్రాండ్ తాగాడో నని గ్రామస్తులు సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Drunken Man Gets Unexpected 'Hug' from Python in Kurnool District
— Voiceup Media (@VoiceUpMedia1) October 15, 2024
A shocking incident occurred in Kurnool district when a drunken man became an unlikely 'host' to a curious python. The snake slithered onto the man, sending shockwaves among onlookers."#Kurnool #PythonEncounter pic.twitter.com/zTS6febrRG
ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం- మీ జిల్లాకు ఎవరో ఇక్కడ చూడండి