అన్వేషించండి

Breaking News Today: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: జగన్

Andhra Pradesh And Telangana Breaking News: తెలుగు రాష్ట్రాలతోపాటు కేంద్ర బడ్జెట్‌ సమావేశాల వివరాలు, ఇతర న్యూస్ అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIVE

Key Events
Breaking News Today: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: జగన్

Background

Breaking News In India Today in Telugu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, ప్రత్యర్థులపై దాడులు పెరిగిపోయాయని నేడు ఢిల్లీలో ధర్నా చేయనున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. వైసీపీ కార్యకర్తలను హతమార్చడమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. ఈ మారణ హోమాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లేందుకే దేశ రాజధానిలో నిరసన తెలపనున్నట్టు జగన్ ఇప్పటికే ప్రకటించారు. 

11 గంటల నుంచి 5 వరకు ధర్నా

కూటమి అధికారంలోకి వచ్చి కేవలం 50 రోజులు మాత్రమే అయిందని ఈ కొద్ది రోజుల్లోనే 36 హత్యలు జరిగాయని, 16 హత్యాచారాలు, వెయ్యికిపైగా దాడులు, అంతకు మించి ఆస్తుల విధ్వంసాలు చేశారని ఆరోపిస్తూ పోస్టర్లు రిలీజ్ చేసింది వైసీపీ. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపిస్తోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర నాయకులతో కలిసి ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు ధర్నా చేస్తున్నారు.  

రెడ్‌ డైరీ పాలన నడుస్తోందని విమర్శ

టీడీపీ తన సభల్లో రెడ్ డైరీ చూపించి కేసులు ఎక్కువ ఉన్న వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది.  వైసీప నాయకులను తరిమికొట్టండి, హాకీ స్టిక్‌లతో కొట్టండి, తొక్కేయండీ అంటూ రెచ్చగొట్టండ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. జూన్‌ 4 నుంచి నేటి వరకు వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఈ దాడులకు భయపడి చాలా మంది ఊళ్లు విడిచిపెట్టి వెళ్లిపోయారని చెబుతోంది. 

వినుకొండలో వైసీపీ కార్యకర్తను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదని ఏదో ఒకరిద్దరిపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించింది వైసీపీ. టీడీపీ చర్యలతో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని ఇలాంటి ఘటనలపై సీఎం స్థాయిలో చంద్రబాబు స్పందించకపోవడం దారుణమని ఆంటున్నారు. అలాంటి వారిని వెనుకేసుకొచ్చేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 

వీలైతే కేంద్రం పెద్దలతో సమావేశం

రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై గవర్నర్‌తోపాటు ప్రధానికి లేఖలు రాశారు మాజీ సీఎం జగన్. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్టు ప్రకటించారు. అపాయింట్‌మెంట్ ఇస్తే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలవనున్నారు. 

రాష్ట్రపతి పాలన, కేంద్ర స్థాయిలో దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తోనే గవర్నర్‌ కలిశారు. దాడులకు సంబంధించిన వివరాలు అందజేశారు. బడ్జెట్ సమవేశాల్లో కూడా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినాదాలు చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. 

ఢిల్లీలో చేసే ధర్నా కోసం మాజీ సీఎం జగన్ ఇప్పటికే దేశ రాజధాని చేరుకున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. కేంద్రం పెద్దలు అపాయింట్‌మెంట్ ఇస్తా వారితో సమావేశమై వివరాలు అందజేస్తారు. 

11:33 AM (IST)  •  24 Jul 2024

YSRCP Chief Jagan: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: జగన్ 

YSRCP Chief Jagan Is Holding Dharna In Delhi: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఢిల్లీలో ధర్నా చేపట్టారు మాజీ సీఎంవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.  టీడీపీ అధికారంలోకి వచ్చిన 45రోజుల్లోనే వెయ్యికిపైగా అక్రమకేసులు నమోదు అయ్యాయని ఆరోపించారు. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం చేశారన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ చూపించిన రెడ్‌ బుక్ ఆధారంగానే ఇలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇవాళ మీరు అధికారంలో ఉండొచ్చని రేపు తాము అధికారంలోకి రావచ్చని అన్నారు. కానీ ఇలాంటివి ప్రోత్సహిస్తే రేపు మీరు రోడ్లపై తిరగలేరని అన్నారు. 

09:39 AM (IST)  •  24 Jul 2024

Budget 2024: బడ్జెట్‌పై విపక్షాలు ఆగ్రం- నేడు పార్లమెంట్‌లో నిరసన 

Budget 2024: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదవాళ్లకు అనుకూలంగా లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలు పాలించే రాష్ట్రాలకి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శిస్తున్నాయి. అందుకే నేడు పార్లమెంట్‌లో నిరసనప్రదర్శన చేయాలని నిర్ణయించాయి. రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో సమావేశమైన ఇండీ కూటమి నేతలు ఈ మేరు నిర్ణయం తీసుకున్నాయి. ఉదయం పదిన్నరకు పార్లమెంట్ ఆవరణంలో ధర్నా చేయాలని నిర్ణయించాయి. దీంతోపాటు తమకు బడ్జెట్‌లోఅన్యాయం జరిగిందని చాలా రాష్ట్రాలు 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నట్టుప్రకటించాయి. 

09:33 AM (IST)  •  24 Jul 2024

Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్‌లో నాలుగు కాళ్లు చేతులు రెండు ముఖాలతో పుట్టిన శిశువు

Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీతాపూర్లోని ఆసుపత్రిలో అరుదైన శిశువు జన్మించింది. రెండు ముఖాలు, నాలుగు కాళ్లు చేతులతో జన్మించిన శిశువు చూసి జనం ఆశ్చర్యపోయారు. ఆ పాపను చూసేందుకు జనం భారీగా ఆసుపత్రికి తరలి వచ్చారు. జన్యులోపంతో జన్మించిన పాప పుట్టిన ఐదుగంటల్లోనే చనిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. 

09:28 AM (IST)  •  24 Jul 2024

Hyderabad News: గచ్చిబౌలిలో ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి- తన కోసం వెతకొద్దంటూ లేఖ 

Telangana News: తమ్ముడిని తీసుకొని ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన కోసం వెతకొద్దని లెటర్ కూడా రాసి పెట్టింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరి కోసం వెతుకుతున్నారు. 

తూర్పు గోదావరి జిల్లా కాలా మండలానికిచెందిన నరేష్ గచ్చిబౌలిలోని మజీద్ బండ ప్రభుపాద లేఅవుట్ నివాసం ఉంటున్నాడు. తన అక్క భావ చనిపోవడంతో మేనకోడలు హారిక, మేనల్లుడు ఫణీంద్రను తనే చూసుకుంటున్నారు. మేనకోడలు హారికను 2022లో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె బీటెక్, ఫణీంద్ర ఇంటర్ చదువుతున్నాడు. 

2024 ఫిబ్రవరి 20న కాలేజీకి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి హారిక,ఫణీంద్ర వెళ్లిపోయారు. సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోవడంతో వాళ్ల రూమ్‌లో చూస్తే లెటర్ కనిపించింది. తమ కోసం వెతకొద్దని అందులో ఉంది. ఇన్ని రోజులు ఎక్కడెక్కడో వెతికిన కుటుంబ సభ్యులు ఇక లాభ లేదు అనుకొని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. 

09:17 AM (IST)  •  24 Jul 2024

Boat Accident In Ambedkar Konaseema Ditrict: ముమ్మిడివరం నియోజకవర్గంలో బోటు ప్రమాదం- ఏడుగురు మత్సకారులు సురక్షితం

Boat Accident In Ambedkar Konaseema Ditrict: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. వేటకు వెళ్లిన మత్సకారుల పడవ భారీగా ఎగసిన అలలు ధాటికి ఇంజన్ బోటు పగిలిపోయింది. దీంతో మత్స్యకారులంతో నీటిలో మునిగిపోతూ హాహాకారాలు చేశారు. వారిని రిలయన్స్ రిగ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.ప్రమాదం గురించి తెలుసుకున్న భైరవపాలెం, సావిత్రి నగర్‌లో ఉంటున్న మత్సకారుల ఫ్యామిలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి తమవారిని బయటకు తీసుకురావాలని అభ్యర్థిస్తున్నారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget