Capital Expenditure : రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం మూల ధన వ్యయాన్ని రికార్డు స్థాయిలో రూ. 11.21 లక్షల కోట్లకు పెంచనుంది. ఇది 2024-25 సవరణ అంచనాల కంటే 10.1 శాతం అధికం.

India Budget 2025 : 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం మూల ధన వ్యయాన్ని రికార్డు స్థాయిలో రూ. 11.21 లక్షల కోట్లకు పెంచనుంది. ఇది 2024-25 సవరణ అంచనాల కంటే 10.1 శాతం అధికం. ఈ పెరుగుదల దేశీయ స్థూల ఉత్పత్తి (GDP) వృద్ధి రేటుతో సమానంగా ఉండడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP అంచనా రూ. 356.97 లక్షల కోట్లుగా ఉండగా, ప్రభుత్వ మూల ధన వ్యయం మొత్తం GDPలో 3.14 శాతంగా ఉంటుంది.
Also Read :Income Tax: 8 నుంచి 50 లక్షల శాలరీ వచ్చే ఉద్యోగులకు ఎంత పన్ను ఆదా అవుతుందో ఇక్కడ చూడండి
రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాలకు అధిక కేటాయింపు
సాంప్రదాయంగా కొనసాగిన విధంగానే, ప్రధానంగా రోడ్లు, రైల్వేలు, రక్షణ పరికరాల కోసం భారీగా నిధులు కేటాయించారు. ప్రభుత్వం మూల ధన వ్యయంలో సుమారు 55 శాతం రోడ్లు, రైల్వేలు, రక్షణ పరికరాలపై ఖర్చు చేయనుంది. రైల్వే శాఖకు రూ. 2.52 లక్షల కోట్లు, రోడ్డు రవాణా శాఖకు రూ. 1.87 లక్షల కోట్లు, రక్షణ రంగానికి రూ. 1.8 లక్షల కోట్లు కేటాయించబడింది. ఈ మూడు రంగాలు కలిపి మొత్తం మూల ధన వ్యయంలో సగానికి పైగా వాటా కలిగి ఉన్నాయి.ప్రభుత్వం మొత్తం వ్యయంలో ప్రతి రూ. 100కు సుమారు రూ. 22 మూల ధర వ్యయానికి కేటాయించనుంది. ఇది 2025 సవరణ అంచనాల కంటే స్వల్పంగా ఎక్కువ. అదేవిధంగా, ప్రభుత్వ రంగ యూనిట్లు 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో ప్లాన్ చేసిన పెట్టుబడుల కంటే 13 శాతం అధికం. ఈ విధంగా, రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెరగడం ద్వారా దేశంలోని మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, దీంతో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Also Read : New Income Tax Slabs 2025: ఆదాయ పన్ను మినహాయింపు.. ఆదాయం 12 లక్షలు దాటినా కానీ అద్భుతమైన ప్రయోజనమే!
ఈ విధంగా కేటాయింపులు
* రైల్వే శాఖకు రూ. 2.52 లక్షల కోట్లు
* రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలకు రూ. 1.87 లక్షల కోట్లు
* రక్షణ పరికరాల కోసం రూ. 1.8 లక్షల కోట్లు
రోడ్లు, రైల్వేలకు ఖర్చు చేయబోయే మొత్తం వ్యయం ప్రభుత్వం ఇచ్చే అనేక రకాల సబ్సిడీల కంటే అధికంగా ఉంది.
ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల్లో పెరుగుదల
ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) 2025-26లో రూ. 4.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇది FY25లో కంటే 13 శాతం అధికం.
ప్రభుత్వ వ్యయంలో కీలక మార్పులు
FY26లో మొత్తం ప్రభుత్వం ఖర్చు చేయబోయే ప్రతి రూ. 100కు సుమారు రూ. 22 మూల ధన వ్యయానికి కేటాయించనుంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరం సవరణ అంచనాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ. ఈ భారీ పెట్టుబడులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడతాయని, దీని ప్రభావం ఆర్థిక వృద్ధిపై కూడా అనుకూలంగా ఉండొచ్చని అంచనా.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

