అన్వేషించండి

Breaking News Today: మను బాకర్‌ మరో అద్భుతం- భారత్ ఖాతాలో మరో ఒలింపిక్ పతకం

Andhra Pradesh And Telangana Breaking News: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అప్‌డేట్స్‌తోపాటు జాతీయ అంతర్జాతీయ విశేషాల కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి. ఒలింపిక్స్‌లో పతకాల అప్ డేట్స్‌నూ ఇక్కడ చూడొచ్చు.

LIVE

Key Events
Breaking News Today: మను బాకర్‌ మరో అద్భుతం- భారత్ ఖాతాలో మరో ఒలింపిక్ పతకం

Background

Breaking News In India Today in Telugu: భారీ వర్షాలతో కేరళలోని వయనాడ్ అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడి ఊళ్లకు ఊళ్లే బురదతో నిడిపోయింది. మెప్పాడి, ముండక్కై పట్టణం, చురాల్‌మాలలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. దాదాపు పాతిక మంది ప్రాణాల తీసింది. ఇంకా వందల మంది గల్లంతయ్యారు. 

కేరళలోని వయనాడ్‌ జిల్లా మెప్పాడిలో ఘోర ప్రమాదం జరిగింది. వేకువజామున కొండచరియలు విరిగిపడటంతో  25 మంది వరకు మృతి చెందారు భారీ సంఖ్యలో మట్టిలో ఇరుక్కుపోయినట్టు సమాచారం అందుతోంది. వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మెప్పాడి ముండకైలో కురుస్తున్న భారీ వర్షాలకు వందల వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు నీటమునిగాయి. ఇలాంటి విషాదం గతంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినవారిని కోల్పోయిన వారు కొందరైతే... తమ వారు ఎలా ఉన్నారో తెలియక కన్నీరుమున్నీరు అవుతున్న వారు మరికొందరు. ఇలా బాధితులతో వయనాడ్‌ మొత్తం విషాదఛాయల్లో మునిగిపోయింది. 

మంగళవారం తెల్లవారు జామున ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు ఆ ప్రాంతాన్ని బురదతో కప్పేసింది. 25 మంది వరకు చనిపోయారని మరో 70 మంది వరకు గాయపడ్డారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇంకా వందల మంది శిథిలాల్లో చిక్కుకొని ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. 

రంగంలోకి దిగిన కేరళ విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు స్పందన దళాలు రంగంలోకి దిగిన సహాయ చర్యలు చేపట్టాయి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న అదనపు బలగాలను కూడా వయనాడ్‌కు పంపిస్తోంది అక్కడి ప్రభుత్వం. భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడ సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు ఎయిర్‌ఫోర్స్‌ కూడా రంగంలోకి దిగింది. బాధితులను గుర్తించేందుకు మిగ్‌ 17ను రంగంలోకి దించింది. 

అర్థరాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడ్డట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ శిథిలాల్లో వందల మంది చిక్కుకున్నారని వారు వాపోతున్నారు. కొందర్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆచూకీ తెలియని వారి కోసం గాలిస్తున్నారు. ప్రమాదంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా సహయక చర్యల్లో పాల్గొంటోందని చెప్పారు. సహాయ చర్యల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. 9656938689, 8086010833 నంబర్లకు ఫోన్‌ చేసి తమ ఫిర్యాదులు, అభ్యర్థనలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. 

ఈ దుర్ఘటనపై కేరళ సీఎం విజయన్, ప్రధానమంత్రి మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్ష రూపాయలు పరిహారం ప్రకటించింది కేంద్రం. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అసవరమైతే సైన్యం సాయం కూడా తీసుకుంటామని ప్రకటించింది. ఇప్పటి వాయు సేన రంగంలోకి దిగింది. బాధితులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. 

వయనాడ్‌ పరిస్థితి అలా ఉంటే... వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. ప్రభుత్వం కూడా అందుకుతగ్గట్టుగానే చర్యలు తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. 

13:27 PM (IST)  •  30 Jul 2024

Paris Olympics 2024: మను బాకర్‌ మరో అద్భుతం- భారత్ ఖాతంలో మరో ఒలింపిక్ పతకం

Paris Olympics 2024 India WIN Bronze medal Manu Bhaker becomes 1st Athlete to win 2 medals in single edition: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వరించింది. మిక్స్డ్‌ ఈవెంట్‌లో మనుబాకర్‌  సరబ్‌జోత్ సింగ్‌ కాంస్య పతకాన్ని సాధించారు. ఇలా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారిణిగా ‌మనుబాకర్ చరిత్ర సృష్టించారు. 

12:26 PM (IST)  •  30 Jul 2024

Vizag News: విశాఖ మెడికవల్‌ ఆసుపత్రిలో ప్రమాదం

Fire Accident At Medicover Hospital In Vizag: విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్‌లో ఉన్న బ్యాటరీలకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో రోగులు , వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. భారీగా పొగ వ్యాపించడంతో ఇబ్బందిపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటే స్పాట్‌కు వచ్చిన మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. 

12:21 PM (IST)  •  30 Jul 2024

Telangana Crime News: తెలంగాణలో మరో దారుణం- కదలుతున్న బస్‌లో మహిళపై అత్యాచారం 

Crime News: నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా ప్రకాశం వెళ్లే బస్సులో జరిగిన అత్యాచారం కలకలం రేపింది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. డయల్‌ 100కు ఫోన్ చేసి ప్రయాణికులు తెలియజేయడంతో ఓయూ పోలీసులు అప్రమత్తమై డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటన జరిగిన టైంలో బస్‌లో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. 

12:17 PM (IST)  •  30 Jul 2024

KTR On Musi River: మూసీ ప్రక్షాళనకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు: కేటీఆర్ 

KTR On Musi River: మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మూసీలో తాము 3,866 కోట్లతో వంద శాతం సివరేజ్ ట్రీట్మెంట్ చేశామన్నారు. కాంగ్రెస్‌ కొత్తగా చేయడానికి ఏం లేదన్నారు. సివరేజ్ ట్రీట్మెంట్ పూర్తైన తర్వాత తమ ప్రభుత్వం ఉన్నపుడు 16 వేల కోట్ల అంచనాతో మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేశామన్నారు. ఇవన్నీ వదిలేసి మూసీ ప్రక్షాళనపై ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తున్నారన్నారు. మూసీపై ఎక్స్ ప్రెస్ వే, బ్యూటిఫికేషన్‌తో కలిపి 16 వేల కోట్లుతో అంచనాలు సిద్ధం చేశామన్నారు. అది ఎందుకు 50 వేల కోట్లు అయ్యిందని ప్రశ్నించారు. మళ్లీ అది 70 వేల కోట్లకు ఎలా చేరిందని నిలదీశారు. ఎందుకు అది మళ్లీ లక్ష 50 వేల కోట్లుకు చేరిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ప్రజల సొమ్ము మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు కేటీఆర్. 

12:12 PM (IST)  •  30 Jul 2024

Gang Rape In Hyderabad: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో గ్యాంగ్ రేప్- స్నేహితుల చేతిలో మోసపోయిన యువతి

Hyderabad News: హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో దారుణం జరిగింది. స్నేహితులే కదా అని నమ్మి హోటల్‌కు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.  హోటల్‌కు తీసుకెళ్లి ఆమెపై స్నేహితులు అత్యాచారం చేశారు. మద్యం మత్తులో యువతిపై పాడుపనికి పాల్పడ్డారు. స్నేహితుడితోపాటు తనపై మరొకరు అత్యాచారం చేశారని ఆయవతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Kannappa : పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Embed widget