Telugu breaking News: నాల్గో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం- సిరీస్ కైవశం
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE
Background
Latest Telugu breaking News: సుప్రీంకోర్టులో ఇవాళ (ఫిబ్రవరి 26న) ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ గతంలోనే దాఖలైంది. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం చంద్రబాబుకు బెయిల్ రద్దు పిటిషన్‌ను సోమవారం విచారించనుంది.
సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 12 ఈ పిటిషన్ పై విచారణ జరగ్గా ధర్మాసనం రెండు వారాలకు (ఫిబ్రవరి 26కు) వాయిదా వేసింది. చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసింది. దీని తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాససనం నేడు చేపట్టనుంది. రెండు వారాల కిందట జరిగిన విచారణలో భాగంగా న్యాయవాది హరీష్ సాల్వే కొన్ని ఇబ్బందుల వల్ల నేడు కోర్టుకు రాలేక పోయారని మరో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వివరించారు. అందుకే ఈ కేసును 3 వారాలపాటు వాయిదా వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐడీ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. వీలయినంత త్వరగా డేట్ ఇవ్వాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఈ కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది. అందులో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీన కేసు విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం సోమవారం ఈ కేసు విచారణ చేపట్టనుంది.
ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ స్పెషల్ లీవ్ పిటిషన్ ను గతేడాది వేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు గతేడాది సెప్టెంబరులో అరెస్టు కాగా, ఏపీ హైకోర్టు నవంబరులో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తొలుత తాత్కాలిక బెయిల్ ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాలు చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.
విచారణకు రాలేనని సీబీఐకు లేఖ రాసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
ఫిబ్రవరి 26న (సోమవారం) విచారణకు తాను హాజరు కాలేనంటూ సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) లేఖ రాశారు. సీబీఐకి రాసిన లేఖలో ఎమ్మెల్సీ కవిత కీలక అంశాలను ప్రస్తావించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ (CRPC Sec 41A) కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐ(CBI)ని ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని కవిత స్పష్టం చేశారు. సీబీఐ నోటీసులకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న కారణంగా.. ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను భారత జట్టు 3-1తో కైవసం చేసుకుంది. నాలుగో టెస్టులో టీమిండియాకు ఇంగ్లాండ్ 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఒకానొక సమయంలో భారత్ 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్ 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమ్ఇండియాను గెలిపించారు. గిల్ 52, జురెల్ 39 పరుగులతో అజేయంగా నిలిచారు.
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా - కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా - కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TTD News: టీటీడీ ఉద్యోగులకు జీతాల పెంపు- క్యాంటీన్‌లోనే భోజన వసతి- పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD News: తిరుమల అన్నమయ్య భవన్‌లో టిటిడి పాలక మండలి సమావేశం ముగిసింది. నడక దారిలోని గాలిగోపురం, ఆంజన్న విగ్రం, మోకాలిమెట్టు దగ్గర నిత్య సంకీర్తనార్చ చేయాలని నిర్ణయం. 1.69 కోట్లతో శ్రీవారి ఆలయంలో జయ విజయుల విగ్రహాల బంగారు తాపడం పనులకు ఆమోదం తెలిపింది. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని (ఫిబ్రవరి 24) ప్రతి ఏడాది నిర్వహించాలని నిర్ణయించింది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో 3 కోట్లతో లైటింగ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. సప్తగిరి వసతి గదులు 1,4 బ్లాకుల ఆధునికీకరణకు 3.11 కోట్లు కేటాయించారు. శ్రీలంకలోని కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ప్రణాళిక రచించాలని నిర్ణయం. టీటీడీ కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగులకు 15 వేల మందికి జీతాల పెంచారు. 3 నుంచి 20వేల వరకు జీతాలు పెంచుతూ టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఉద్యోగుల క్యాంటీన్లో భోజనం వసతి కల్పిస్తోంది.
టీమిండియా విజయానికి 74 పరుగుల దూరం
నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి 74 పరుగుల దూరంలో ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లు పిచ్ పరిస్థితి సద్వినియోగం చేసుకుంటూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. నాలుగో రోజు మ్యాచ్ లో ప్రస్తుతం భారత్ స్కోరు 118 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. క్రీజ్ లో గిల్ (18), రవీంద్ర జడేజా (3) ఉన్నారు. లంచ్ బ్రేక్ తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభం కానుంది.