Telugu breaking News: మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE

Background
లక్ష కోట్లు ఖర్చుపెట్టినా, లక్ష ఎకరాలకు నీళ్లు అందలేదు: రేవంత్ రెడ్డి
మహదేవపూర్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. లక్ష ఎకరాలకు కూడా నీరు అందించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లను, ప్రాజెక్టును మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. గతేడాది అక్టోబరు 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇన్‌ఛార్జి చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
సమీక్ష, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరువాత సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు రూపాయలు ఖర్చుపెట్టినా.. కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని ఆరోపించారు. కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినా.. కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. సమస్య తెలిసినా, చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ప్రాజెక్టు ద్వారా సాగునీరు వచ్చిందో లేదో కానీ, ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయని సెటైర్లు వేశారు. ప్రాజెక్టు సంబంధిత రుణాలు, ఇతర ఖర్చులతో కాళేశ్వరానికి ఏటా రూ.25వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు.
మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నీటిపారుదలశాఖ అధికారులు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన 21వ పిల్లర్, ప్రాజెక్టును రేవంత్ టీమ్ పరిశీలించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు కాళేశ్వరం ప్రాజెక్టుతో తేలిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy At Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన పిల్లర్లను పరిశీలించిన సీఎం రేవంత్ టీమ్
Medigadda Barrage: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలనకు బస్సుల్లో వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిపోయిన 21వ పిల్లర్ ను సీఎం రేవంత్ టీమ్ పరిశీలించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు, పిల్లర్లకు పగుళ్లను నేతలు పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ స్థాయిలో వైఫల్యం కనిపిస్తోందని సీఎం రేవంత్, మంత్రులు, ఇతర నేతలు భావిస్తున్నారు. మరికాసేపట్లో మేడిగడ్డ బ్యారేజీ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
పది లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శామీర్ పేట తహసీల్దార్
శామీర్ పేట తహసీల్దార్ పదిలక్షల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు చిక్కాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు... ఆయన్ని ఆయన డ్రైవర్‌ను అరెస్టు చేశారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు డ్రైవర్ బద్రి డబ్బులు తీసుకున్నాడు. అందుకే ఇద్దరినీ అరెస్టు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

