Breaking News: రైల్వేకోడూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి మార్పు - అరవ శ్రీధర్ పేరు ప్రకటన
Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE
![Breaking News: రైల్వేకోడూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి మార్పు - అరవ శ్రీధర్ పేరు ప్రకటన Breaking News: రైల్వేకోడూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి మార్పు - అరవ శ్రీధర్ పేరు ప్రకటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/fc2b7c590b7abb9ef7a71be0f80c63551712202356506215_original.png)
Background
Latest Telugu Breaking News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బుదవారం ఏనుగు దాడిలో అల్లూరి శంకర్ అనే రైతు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరవకముందే జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మరో రైతుపై ఏనుగు దాడి చేసింది. పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య(50 )అనే రైతు గురువారం ఉదయం కరెంటు మోటర్ వేయడానికి పొలానికి వెళ్తుండగా ఒక్కసారిగా అతడిపై ఏనుగు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు గమనించి కేకలు వేయడంతో ఏనుగు సమీప అడవిలోకి వెళ్ళిపోయింది. విషయం తెలుసుకున్న కారు పోచయ్య కుటుంబీకులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకుని విచారిస్తున్నారు. సమీప పంట పొలాల్లోకి రైతులు ఎవరూ వేళ్లొద్దని సూచిస్తున్నారు.
సిర్పూర్ (టి) నియోజకవర్గంలో 24 గంటల వ్యవధిలోనే ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందడంతో సమీప గ్రామాల్లోని ప్రజలు రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది దాటి తెలంగాణ వచ్చిన ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందడంతో సమీప గ్రామాల్లోని ప్రజలు బయటకు రావద్దని పంట పొలాలకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఏనుగుల సంచారం పై మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సిర్పూర్ నియోజకవర్గంలో ఏనుగుల సంచారం, ఏనుగుల దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కతో కూడా మాట్లాడినట్టు వెల్లడించారు. స్పందించిన మంత్రులు జిల్లా అటవీశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారన్నారు.
ఏనుగు దాడిలో మరణించిన కుటుంబాలను మంత్రు పరామర్శించాలి.: సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బూరేపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో మరణించిన శంకర్ కుటుంబాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన"అటవీశాఖ అధికారుల సమన్వయలోపంతో కాగజ్ నగర్ అటవీ డివిజన్‌లో రెండు నిండు ప్రాణాలను ఏనుగు బలిగొన్నది.చనిపోయిన కుటుంబాలకు మహారాష్ట్ర మాదిరిగా 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందించాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఏనుగును తిరిగి ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాలకు పంపించడానికి ఏర్పాట్లు చేయాలి. అటవీ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జీ మంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇవ్వాలి.
రైల్వేకోడూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి మార్పు - అరవ శ్రీధర్ పేరు ప్రకటన
రైల్వేకోడూరులో జనసేన అభ్యర్థిని పవన్ కల్యాణ్ మార్చారు. యనమల భాస్కరరావు స్థానంలో అరవ శ్రీధర్ పేరును జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ బాధితులకు హరీష్ పరామర్శ
సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే ఇలాంటి దుర్ఘటనలు తరచూ జరుగుతున్నాయని విమర్శించారు.
ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత- కార్మికులను అడ్డుకున్న పోలీసులు
సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీలోకి కార్మికులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం తోపులాట జరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)