Afganisthan Crisis Update: ఆపద్ధర్మ అధ్యక్షుడిగా అమ్రుల్లా సాలే.. స్వయంగా ప్రకటించుకున్న నేత
అప్గానిస్థాన్ ఆపద్దర్మ అధ్యక్షుడిగా తనకు తానే స్వయంగా ప్రకటించుకున్నారు అమ్రుల్లా సాలే. ఈయన ఘనీ ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
అఫ్గాన్ లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఆపద్ధర్మ అధ్యక్షుడిగా తనకు తానే ప్రకటించుకున్నారు అమ్రుల్లా సాలే. ఘనీ ప్రభుత్వంలో అమ్రుల్లా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇతర నాయకుల మద్దతు, సాయం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
#Afghanistan's First Vice President Amrullah Saleh declares himself caretaker president of the country; says he is "reaching out to all leaders to secure their support & consensus" pic.twitter.com/SUG3e7vLCL
— ANI (@ANI) August 17, 2021
ఆప్ఘనిస్థాన్ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం తాత్కాలిక అధ్యక్షుడిగా తానే అర్హుడినని అమ్రుల్లా సాలే ప్రకటించారు. రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు చనిపోయినా... దేశంలో లేకపోయినా, అందుబాటులో లేకపోయినా ఉపాధ్యక్షుడే బాధ్యతలు చేపట్టాలని రాజ్యాంగం చెబుతోంది. ఈ లెక్కప్రకారం ప్రస్తుతం దేశాధ్యక్షుడు దేశంలో లేడని... గందరగోళ పరిస్థితులు ఉన్నాయని అందుకే తానే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు అమ్రుల్లా.
ALSO READ:రిటర్న్ ఆఫ్ 'తాలిబన్'.. ఈసారి అంతకుమించి!
తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్‌ఘని దేశాన్ని వదిలి పారిపోయారు. అప్పటి నుంచి దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టబోమని తాలిబన్లు చెబుతున్నప్పటికీ ఎవరికీ వారిపై నమ్మకం కుదరడం లేదు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే అమ్రుల్లా ప్రకటన సంచలనం రేపింది.
ALSO READ: తాలిబన్లు మళ్లీ ఎలా వచ్చారు..? దానివల్ల భారత్‌కు నష్టం ఏంటి..?
ఆప్ఘనిస్థాన్‌లు తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అష్రఫ్‌ఘనీ.. రాత్రికి రాత్రే దేశం నుంచి పారిపోయారు. ఓ విమానం నిండా డబ్బులు సంచులతో పారిపోయారన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఎక్కడ తలదాచుకున్నాడనే విషయంపై ఇంత వరకు క్లారిటీ లేదు. అమెరికాలో ఉన్నాడని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. మొత్తానికి అమ్రుల్లా ప్రకటన ఇప్పుడు కొత్త చర్చకు దాడి తీసింది.
ALSO READ:రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఎందుకు ఉండాలని అంటారు? అక్కడి కల్చర్ ఏమిటీ?
ALSO READ: క్షమించేశాం బతికిపోండి.. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల శాంతిమంత్రం
ALSO READ:తాలిబన్లు ఉగ్రవాదులే.. నిషేధం విధించిన ఫేస్ బుక్