Afghanistan Crisis: తాలిబన్లు మళ్లీ ఎలా వచ్చారు..? దానివల్ల భారత్‌కు నష్టం ఏంటి..?
ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ తాలిబాన్ల వశమైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వారు దేశాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. తాలిబన్‌లు అధికారంలోకి రావడానికి అమెరికా పరోక్షంగా సహకరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొవిడ్19తో అమెరికా ఆర్థికంగా దెబ్బతిన్నది. ఈ కారణంగా బిలియన్ల డాలర్లు వెచ్చిస్తూ ఆఫ్ఘనిస్తాన్‌లో సేనలను కొనసాగించడం వీలుకాదని అమెరికా ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో నాటో దళాల్ని అమెరికా ఉపసంహరించుకోవడంతో ఒక్కసారిగా తాలిబన్లు చెలరేగిపోయారు. తాము చెప్పినట్లుగానే ఎలాంటి రక్తపాతం జరగకుండా ప్రభుత్వాన్ని కూలద్రోసి తాలిబన్ రాజ్యాన్ని మళ్లీ తీసుకొచ్చింది. తాలిబన్లతో ఎదురుదాడికి దిగితే ఆర్థిక, ప్రాణ నష్టం వాటిల్లుతుందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం భావించి, ఏ మాత్రం ప్రతిఘటించకుండా అధికారం అప్పగించింది. పాక్, చైనా తాలిబన్లతో స్నేహాన్ని కొనసాగించడానికి సిద్ధమని ప్రకటించాయి. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుతో భారత్‌లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితులు భారత్‌పై ప్రతికూల ఫలితాలు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
![PM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/83513c3998c505eb19614c3f0d79c3911739548954270310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Trump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/b6270b046c9d22b765593fbc9296a08f1739548818558310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Elon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/6027f631b47c86aadea3a1699f22f7a91739114934636310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Darien Gap Crossing in Telugu | మానవ అక్రమరవాణాకు దారి చూపెడుతున్న మహారణ్యం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/6bf701a72078ab0b8386308ed53fe2001738947050082310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Minister Jai Shankar on Deportation | మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయరు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/6a5470a2806d7927d3e8be319ef80c6b1738854494471310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)