అన్వేషించండి

Taliban: రిటర్న్ ఆఫ్ 'తాలిబన్'.. ఈసారి అంతకుమించి!

అఫ్గానిస్థాన్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇదే హాట్ టాపిక్. ఓ దేశానికి దేశాన్నే మెరుపు వేగంతో తాలిబన్లు హస్తగతం చేసుకున్నారంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఇన్నేళ్లుగా అమెరికా బలగాల చేతిలో శిక్షణ తీసుకున్న అఫ్గాన్ సైన్యం అంత తేలిగ్గా తాలిబన్లకు ఎలా లొంగిపోయింది? తమ దేశాన్ని ఎలా విడిచిపెట్టేసింది? ఇప్పుడు అందరినోటా ఇదే ప్రశ్న. ఇటీవల అమెరికా పత్రికలు కూడా ఈ విషయంపై పలు నివేదికలు వెల్లడించాయి. 

"తాలిబన్లు ఎంత బలంగా ప్రయత్నించినా.. కాబుల్ ను స్వాధీననం చేసుకువాలంటే వారికి కనీసం 30 రోజులు పడుతుంది" ఇది అమెరికాకు చెందిన విదేశీ వ్యవహారాల నిపుణులు కొద్ది రోజుల క్రితం చెప్పిన మాట.

అమెరికా సైన్యం చేసిన విశ్లేషణ ప్రకారం కాబూల్ పతనానికి 90 రోజుల్లో పట్టొచ్చని తేలింది. అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వం 6-12 నెలల్లో కూలిపోతుందని ఈ ఏడాది జూన్‌లో అమెరికా విశ్లేషకులు అంచనా వేశారు.

అయితే అమెరికన్ మిలిటరీ ఇంటెలిజెన్స్, విదేశాంగ శాఖ అంచనాలలో ఏదో తప్పు జరిగిందని తాలిబన్లు ఒకదాని తర్వాత మరొక నగారాన్ని హస్తగతం చేసుకునే సమయానికి అర్థమైంది. జులై 8న శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం అఫ్గాన్ ఉన్న పరిస్థితికి ఎలాంటి సంబంధం లేదు. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరగడానికి అర్థం ఆ దేశాన్ని తాలిబన్లకు అప్పగించడం కాదని బైడెన్ వ్యాఖ్యానించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బైడెన్ చెప్పిన సమాధానాలివే.

ప్ర. మిస్టర్. ప్రెసిడెంట్.. మీరు తాలిబన్లను నమ్ముతున్నారా? అఫ్గాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం అనివార్యమా?

బైడెన్: లేదు, అలా జరగదు.

ప్ర. ఎందుకు?

బైడెన్: ఎందుకంటే.. 3 లక్షల మంది సాయుధులైన సైనికులతో అఫ్గాన్ మిలిటరీ ప్రపంచ స్థాయి సైనిక శక్తిగా ఉంది. ఆ సైన్యాన్ని ఎదుర్కొని నిలబడటం 75 వేల మంది తాలిబన్లకు అసాధ్యం.

ఆ దాడికి ప్రతీకారంగా..

అమెరికా నిఘా విశ్లేషణ, నిపుణుల అంచనాలు పూర్తిగా తలకిందులు అవడం ఇదే మొదటిసారి. 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌లో బాంబు దాడులు జరిగాయి. ఇందుకు ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ అఫ్గానిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్నాడని అమెరికా నమ్మింది. అప్పుటి ప్రెసిడెంట్ బుష్.. ఈ దాడి చేసిన వారిపై అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. న్యాయం, మానవ హక్కులు, అంతర్జాతీయ సమాజం సమగ్రతపై జరిగిన దాడిగా దీన్ని అభివర్ణించిన అమెరికా.. అఫ్గానిస్థాన్ పై యుద్ధం చేయడానికి సిద్ధమైంది. 1812లో బ్రిటిష్ దళాలు.. వాషింగ్టన్ డీసీని చాలా వరకు నాశనం చేసినప్పటికీ అమెరికా ప్రధాన భూభాగంపై 9/11 కంటే పెద్ద దాడి ఎప్పుడూ జరగలేదు.

2001లో అఫ్గానిస్థాన్ పై అమెరికా దాడి చేసిన ఏడాది తర్వాత లాడెన్ అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్లాడని తెలిసింది. చివరికి ఒక దశాబ్దం తరువాత పాకిస్థాన్ లో తలదాచుకుంటున్నట్లు గుర్తించిన అమెరికా అంతకంతా ప్రతీకారం తీర్చుకుంది.

అఫ్గాన్ సంగతేంటి?

అయితే అఫ్గాన్‌ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైనదేనని బైడెన్ సమర్థించుకున్నారు. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటున్నట్లు పేర్కొన్నారు. అఫ్గాన్‌ నుంచి సైనికులను రప్పించడానికి సరైన సమయం అంటూ లేదని, 20 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించానని జో బైడెన్‌ పేర్కొన్నారు. అయితే అనుకున్నదానికంటే వేగంగా తాలిబన్లు అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టారని తెలిపారు. తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఈ ఏడాది అమెరికా దళాలను అఫ్గాన్‌ నుంచి వెనక్కి రప్పించడం లేదా మరిన్ని సైనిక దళాలను అఫ్గాన్‌కు పంపి మూడో దశాబ్దంలో కూడా యుద్ధాన్ని కొనసాగించడమే అని అన్నారు. అయితే గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయానికే తాను కట్టుబడతానన్నారు. ఈ నిర్ణయంపై చింతించడం లేదన్నారు. ఈ నిర్ణయం అమెరికాకు సరైందన్నారు. అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే మా లక్ష్యమని బైడెన్‌ తెలిపారు. ‘‘అఫ్గాన్‌లో అమెరికా బలగాలను ఇంకా ఉంచాల్సిందని వాదిస్తున్నవారిని నేను ఒకే ప్రశ్న అడగదలుచుకున్నా.. అఫ్గానిస్థాన్‌ సైనికులే వారి సొంత దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో పోరాడడం లేదు. అలాంటి యుద్ధంలో పోరాడడానికి ఇంకా ఎన్ని తరాల అమెరికా బిడ్డలను పంపమంటారు?’’ అని బైడెన్‌ ప్రశ్నించారు.

అఫ్గాన్ దేశ నిర్మాణం తమ లక్ష్యం కాదని బైడెన్ మరోసారి గుర్తుచేశారు. అయితే తాలిబన్లతో నిత్యం అంతర్యుద్ధం ఎదుర్కొంటున్న దేశంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుంది అన్న ప్రశ్న ప్రజాస్వామ్య వాదులు లేవనెత్తుతున్నారు. దేశంలో పూర్తి ప్రజాస్వామ్యం ఉన్ననాడే ఇది జరుగుతుందని.. అమెరికా తన బలగాలను ఇలా హఠాత్తుగా ఉపసంహరించుకోవడం వల్లే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయనే వాదన వినిపిస్తుంది.

అంత ఈజీగా ఎలా..?

అమెరికా సాయంగా సమకూర్చిన ఆయుధాలు, నిధులతో రెండు దశాబ్దాలుగా ఆఫ్గాన్‌ సైన్యం ఎంతో రాటుతేలిందని భావించినా అదంతా వృథాగానే మిగిలిపోయింది. ఆ సైన్యం తాలిబన్‌ ఫైటర్లను దీటుగా ఎదుర్కోలేకపోయింది. కొందరు సైనికులు అవినీతికి అలవాటుపడిపోవడం, తాలిబన్‌లకు పావులుగా మారడంతో ఈ సంక్షోభ సమయంలో దీటుగా ఎదుర్కోలేక చతికిలపడిపోయారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆఫ్గాన్‌ అధ్యక్షుడిగా కొనసాగిన అష్రఫ్‌ ఘనీ కూడా తక్కువేం తినలేదు. ఆయన దేశంలోని ఉత్తర ప్రాంతంలో బలీయశక్తిగా ఉన్న నార్తర్న్‌ అలయన్స్‌ (ఉత్తర కూటమి)ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. దీంతో 2001లో అమెరికాకు సహకరించిన ఉత్తరకూటమి ప్రస్తుతం పోరాడే సత్తా లేక పూర్తిగా చతికిలపడింది. ఇరాక్‌లోనూ తొలినాళ్లలో ఇలాంటి పరిస్థితులే ఏర్పడినా ఆ దేశ సైన్యం తిరిగి పుంజుకోవడంతో ఐసిస్‌పై విజయం సాధించింది. అయితే అఫ్గాన్‌ సేనలో అంకితభావం, పోరాట పటిమ, దేశభక్తి లేకపోవడం.. తదితర కారణాలతో ఒక్క తూటా కాల్చకుండానే తాలిబాన్లకు లొంగిపోయింది. దీంతో 2 దశాబ్దాల తర్వాత మళ్లీ తాలిబన్లు అధికారం సాధించారు. అయితే ఈసారి మరింత శక్తిమంతంగా కనిపిస్తున్నారు.

      - వినయ్ లాల్, హిస్టరీ, ఆసియా అమెరికన్ స్టడీస్ ఫ్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget