IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Taliban General Amnesty: క్షమించేశాం బతికిపోండి.. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల శాంతిమంత్రం

బిక్కుబిక్కుమంటూ జీవిస్తోన్న అఫ్గానిస్థాన్ ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు తాలిబన్లు. ప్రజలందరూ రోజూవారి కార్యక్రమాలను యథావిధిగా చేసుకోవాలని ప్రకటించారు.

FOLLOW US: 

అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ప్రజల్లో విశ్వాసం, భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు.

" అందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం. అందువల్ల మీరు పూర్తి విశ్వాసం, భరోసాతో జీవనం సాగించండి. ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. ప్రభుత్వ అధికారులంతా విధులకు హాజరుకావాలి                       "
-తాలిబన్ల ప్రకటన 

అఫ్గాన్‌ తాలిబన్ల వశమవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో తాలిబన్ల అరాచక పాలన తెలిసిన ప్రజలు దేశం నుంచి పారిపోయేందుకు విమానాశ్రయాలకు పోటెత్తుతున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు క్షమాభిక్ష ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Afghanistan President: అఫ్గాన్ తదుపరి అధ్యక్షుడు 'బరాదర్' గురించి షాకింగ్ విషయాలు!

శాంతిమంత్రం..

అఫ్గాన్‌ ఆక్రమణల్లో తాలిబన్లు ఈ సారి తమ సహజశైలికి భిన్నంగా శాంతి మంత్రం జపించారు. ఎక్కడా విధ్వంసానికి తెగబడలేదు. తమ ఆక్రమణతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎవరికీ హాని తలబెట్టబోమంటూ మరోసారి భరోసా ఇచ్చారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించొద్దంటూ తాము ఫైటర్లను ఆదేశించామని.. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా వారికి సూచనలు జారీ చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

అమెరికా నేతృత్వంలోని కూటమి తరఫున పనిచేసినవారిపై తామేమీ ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ హామీ ఇచ్చారు. అఫ్గాన్‌ ప్రజల్లో అనవసరపు భయాందోళనలను రేకెత్తించవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. యథావిధిగా పనులకు వెళ్లాలని తాలిబన్లు టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు.

కొత్త అధ్యక్షుడిగా..

అఫ్గానిస్థాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు సిద్ధం అవుతున్నారు. తదుపరి అధ్యక్షుడిగా ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ను ఎంపిక చేసింది తాలిబన్ల బృందం.

అయితే దోహా నుంచి రాజధాని కాబూల్ వచ్చి తదుపరి అధ్యక్షుడిపై తాలిబన్ నేతలు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ఫేస్ బుక్..

తాలిబన్లకు సంబంధించిన ఖాతాలను, సమాచారాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ఫేస్ బుక్ స్పష్టం చేసింది. డేంజరస్ ఆర్గనైజేషన్ పాలసీల కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

Afghanistan-Taliban Crisis: తాలిబన్లు ఉగ్రవాదులే.. నిషేధం విధించిన ఫేస్ బుక్

Published at : 17 Aug 2021 03:54 PM (IST) Tags: kabul taliban afghanistan facebook united states US Law American troops

సంబంధిత కథనాలు

CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు

CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు

Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!

Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Breaking News Live Updates: కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం 

Breaking News Live Updates: కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం 
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా