By: Ram Manohar | Updated at : 03 Dec 2022 01:35 PM (IST)
కేజ్రీవాల్ గేమ్ ఓవర్ అంటూ బీజేపీ సూపర్ మారియో వీడియో గేమ్‌తో సెటైర్ వేసింది. (Image Credits: Twitter)
Kejriwal with Super Mario video:
బైబై కేజ్రీవాల్: బీజేపీ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు (MCD Elections 2022) ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఆప్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరుగుతుండగా...ఇప్పుడవి మరో మెట్టు ఎక్కాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై క్రేజీ వీడియో రూపొందించింది బీజేపీ. సూపర్ మారియో (Super Mario Video Game) వీడియో గేమ్‌తో కొత్త తరహాలో విమర్శలు చేసింది. బీజేపీ ఢిల్లీ (BJP Delhi) అధికారిక ట్విటర్
హ్యాండిల్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. "అవినీతి, అబద్ధాల రాజకీయాలు ఢిల్లీలో 8 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సారి ప్రజలు అబద్ధపు హామీలకు, అవినీతికి "గేమ్ ఓవర్" అని చెప్పేస్తారు" అని ట్వీట్ చేసింది. మారియో గేమ్‌లో మారియో స్థానంలో కేజ్రీవాల్‌ను పెట్టి ఎడిట్ చేసి ఎంతో సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియో మొదట్లో కేజ్రీవాల్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని జోడించింది బీజేపీ. "నేనెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయను" అనే కామెంట్స్‌తో ఈ వీడియో మొదలైంది. బేజీపీ, కాంగ్రెస్‌తో ఎప్పటికీ చేతులు కలపనని తన పిల్లలపై ఒట్టు వేస్తున్నానని చేసిన వ్యాఖ్యలూ ఇందులో వినిపించాయి. ఉచిత విద్యుత్, ఉచిత తాగు నీరు అని చెప్పి ఎంత అవినీతిలో కూరుకుపోయారంటూ
ప్రతి అంశాన్ని గేమ్‌కి రిలేట్ చేస్తూ ఎడిట్ చేసింది బీజేపీ. గేమ్‌లో "శత్రువు"ని ఢిల్లీ ప్రజలుగా చూపించారు. చివర్లో "బైబై టు కేజ్రీవాల్" అని కామెంట్ యాడ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. బీజేపీ నేతలు అంతా తమ ట్విటర్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
दिल्ली में 8 साल से चल रहा झूठ और भ्रष्टाचार की राजनीति का 'गेम',
इस बार जनता करेगी भ्रष्टाचार और खोखले वादों का गेम ओवर। pic.twitter.com/geDFkIE45U — BJP Delhi (@BJP4Delhi) December 3, 2022
इस बार घोटालों और खोखले वादों का “Game Over” https://t.co/kwocUuS4Jy pic.twitter.com/Qf9CaT1dky
— Shehzad Jai Hind (@Shehzad_Ind) December 3, 2022
కేజ్రీవాల్‌పై దాడి
కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగినట్లు ఆప్ తెలిపింది. అయితే కేజ్రీవాల్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వెల్లడించింది.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన సూరత్‌లో ఇటీవల రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఎవరో కేజ్రీవాల్‌పై రాయి విసిరారు. ఈ విషయంపై కేజ్రీవాల్ స్పందించారు.
" ప్రత్యర్థులు నా కన్ను పోగొట్టాలని చూస్తున్నారు. నేను ఏం తప్పు చేశానని దాడి చేస్తున్నారు. 27 ఏళ్లు అధికారంలో ఉన్న భాజపా.. ప్రజలకు ఏం చేసిందో చెప్పాలి. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మహిళలు, యువతలో విశేష స్పందన లభిస్తోంది. మొత్తం 182 సీట్లకు 92 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తాం. "
-అరవింద్ కేజ్రీవాల్, ఆమ్‌ఆద్మీ జాతీయ కన్వీనర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం ఘోరమైన నేరం, జైలు శిక్ష తప్పదు- కొత్త క్రిమినల్ కోడ్
Mulugu Accident: అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో - మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం
ITC Q3 Results: అంచనాలను మించి లాభపడ్డ ITC, Q3లో రూ.5 వేల కోట్ల ప్రాఫిట్
SBI Q3 Result: రికార్డ్ సృష్టించిన స్టేట్ బ్యాంక్, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు
ఆంధ్రప్రదేశ్‌లో టాప్ హెడ్‌లైన్స్ ఇవే!
తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలెర్ట్!
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!