News
News
X

Bihar News: బిహార్ విద్యార్థినికి ఉచితంగా శానిటరీ ప్యాడ్స్, గ్రాడ్యుయేషన్ ఖర్చు కూడా భరిస్తామన్న ఆ సంస్థ

Bihar News: బిహార్ విద్యార్థినికి ఏడాది పాటు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందిస్తామని ఓ సంస్థ వెల్లడించింది.

FOLLOW US: 
Share:

Bihar News: 

ఏ సాయమైనా చేస్తామన్న సంస్థ..

బిహార్‌లో సశక్తి బేటీ కార్యక్రమం ఎంత పెద్ద వివాదాస్పదమైందో తెలిసిందే. ఓ IAS అధికారి, విద్యార్థిని మధ్య జరిగిన సంభాషణ మొత్తం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ముఖ్యంగా శానిటరీ ప్యాడ్స్‌ విషయంలో ఆ అధికారి చేసిన వ్యాఖ్యలపై అందరూ మండి పడ్డారు. చివరకు ఆమె క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే...ఓ శానిటరీ ప్యాడ్స్ కంపెనీ ఆ విద్యార్థినికి ఉచితంగా న్యాప్కిన్స్ అందించేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వం శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వాలన్న ఆ విద్యార్థి డిమాండ్‌ను తాము నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ఏడాది పాటు ఉచితంగా అందిస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన Wet and Dry Personal Care సంస్థ సీఈవో హరిఓం త్యాగి ఈ ప్రకటన చేశారు. BA విద్యార్థి ధైర్యంగా అందరి ముందు శానిటరీ ప్యాడ్స్‌ గురించి మాట్లాడటం వల్ల మరోసారి మహిళల రుతుస్రావానికి సంబంధించిన హైజీన్ గురించి చర్చ వచ్చిందని వెల్లడించింది ఆ కంపెనీ. అంతే కాదు. ఆ విద్యార్థి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత వరకూ అయ్యే ఖర్చునీ భరిస్తామని తెలిపింది. "భవిష్యత్‌లో ఆమెకు ఏమైనా సాయం కావాలన్నా చేస్తాం. ప్రస్తుతానికి మేము చేసే సాయం ఆమెకు చాలా ఉపకరిస్తుందనే అనుకుంటున్నాం" అని వెల్లడించింది. 

సారీ చెప్పిన అధికారి..

తీవ్ర స్థాయిలో తనపై విమర్శలు వెల్లువెత్తటంపై బిహార్ IASఆఫీసర్ హర్జోత్ కౌర్ బుమ్రా స్పందించారు. ఇలా జరిగినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఎవరినో కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పారు. "నా మాటల వల్ల ఏ అమ్మాయైనా బాధ పడితే సారీ. ఎవరి సెంటిమెంట్లనూ హర్ట్ చేయటం నా ఉద్దేశం కాదు" అని వెల్లడించారు. రాతపూర్వకంగా ఈ క్షమాపణలు చెప్పారు హర్జోత్ కౌర్. సశక్తి బేటీ, సమృద్ధి బిహార్ కార్యక్రమానికి హాజరైన హర్జోత్‌ కౌర్‌ను కొందరు విద్యార్థినులు ప్రశ్నలు అడిగారు. యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌లో ఓ బాలిక హర్జోత్‌ కౌర్‌ను ఓ ప్రశ్న అడిగింది. "ప్రభుత్వం స్కూల్ డ్రెస్‌లు ఇస్తోంది. స్కాలర్‌షిప్‌లు కూడా అందిస్తోంది. వీటితో పాటు విద్యార్థులకు ఇంకెన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. అలాంటప్పుడు రూ.20,30 విలువైన శానిటరీ ప్యాడ్స్‌ను ఇవ్వలేదా..?" అని ఓ బాలిక ప్రశ్నించింది. ఈ ప్రశ్న అడగగానే...అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. కానీ...హర్జోత్ కౌర్ మాత్రం సీరియస్ అయిపోయారు. హద్దు పద్దు లేని డిమాండ్‌లు అడుగుతుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఈ వ్యాఖ్యల వల్లే దుమారం..

"మీరడిగినట్టుగానే ప్రభుత్వం మీకు శానిటరీ ప్యాడ్స్ ఇస్తుంది. రేపు మీరు జీన్స్, ప్యాంట్స్, షూస్ కావాలని అడుగుతారు. ఇక ఫ్యామిలీ ప్లానింగ్ విషయానికొస్తే...ప్రభుత్వం నుంచి కండోమ్‌లు కూడా కోరుకుంటారు. అన్నీ ప్రభుత్వం నుంచే ఉచితంగా పొందటానికి నేనెందుకు అలవాటు పడాలి..? ఆ అవసరమేంటి..? " అని కామెంట్ చేశారు. ఈ సమాధానం విని ఆ బాలికకు కాస్త కోపమొచ్చినట్టుంది. వెంటనే కౌంటర్ ఇచ్చింది. 
"ఎన్నికల సమయంలో మీరే కదా ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చి అడిగేది" అని ఘాటుగా బదులిచ్చింది. దీనిపై...ఇంకా ఫైర్ అయ్యారు హర్జోత్ కౌర్. "ఇంత కన్నా స్టుపిడిటీ ఉంటుందా..? నువ్వు ఓటు వేయకు. పాకిస్థాన్ వెళ్లిపో. ప్రభుత్వం తరపున సౌకర్యాలు, డబ్బు తీసుకునేందుకే ఓటు వేస్తున్నావు" అని మండిపడ్డారు. దీనికి వెంటనే ఆ బాలిక కూడా బదులిచ్చింది. "నేను ఇండియన్‌ని. పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లిపోతాను..?" అని ప్రశ్నించింది. "పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతో ప్రభుత్వం ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తోంది. వాళ్లంతా సరిగ్గా పన్నులు కడుతున్నప్పుడు వాళ్లకు కావాల్సిన సేవల్ని డిమాండ్ చేయడంలో తప్పేంటి..? " అని అడిగింది ఆ బాలిక. 

ఈలోగా మరో బాలిక కూడా తమకున్న సమస్యలేంటో వివరించింది. టాయిలెట్స్ సరిగా ఉండటం లేదని, కొందరు అబ్బాయిలూ తమ టాయిలెట్స్‌లోకి వస్తుంటే ఇబ్బందిగా ఉందని చెప్పింది. ఈ సమస్యలపైనా సరిగా స్పందించలేదు..హర్జోత్ కౌర్. సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేసింది. "ఇక్కడున్న అమ్మాయిలందరి ఇళ్లలో వాళ్లకు సెపరేట్ టాయిలెట్స్‌ ఉన్నాయా..?" అని ఆమె అడగటాన్ని చూసి అందరూ కంగు తిన్నారు. మొత్తానికి...అనవసర వ్యాఖ్యలు చేసి..వివాదంలో ఇరుక్కున్నారు హర్జోత్ కౌర్ బుమ్రా. దీనిపై...జాతీయ మహిళా కమిషన్ రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈలోగా హర్జోత్ కౌర్ స్పందించి...సారీ చెప్పారు. 

Published at : 01 Oct 2022 10:13 AM (IST) Tags: BIHAR Sanitary pads bihar news Bihar Girl Wet and Dry Personal Care

సంబంధిత కథనాలు

Weather Latest Update: తీరం దాటిన వాయుగుండం, ఈ జిల్లాలకు వర్ష సూచన! తెలంగాణలో మళ్లీ చలి

Weather Latest Update: తీరం దాటిన వాయుగుండం, ఈ జిల్లాలకు వర్ష సూచన! తెలంగాణలో మళ్లీ చలి

ABP Desam Top 10, 2 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 2 February 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Petrol-Diesel Price 02 February 2023: పెరిగిన పెట్రోల్‌ రేట్లతో బండి తీయాలంటే భయమేస్తోంది, ఇవాళ్టి ధర ఇది

Petrol-Diesel Price 02 February 2023: పెరిగిన పెట్రోల్‌ రేట్లతో బండి తీయాలంటే భయమేస్తోంది, ఇవాళ్టి ధర ఇది

Gold-Silver Price 02 February 2023: ఒక్కసారిగా పెరిగిన పసిడి రేటు, వెండి కూడా వేడెక్కింది

Gold-Silver Price 02 February 2023: ఒక్కసారిగా పెరిగిన పసిడి రేటు, వెండి కూడా వేడెక్కింది

Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!

Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం