అన్వేషించండి
Advertisement
Pallavi Prashanth Bail: పల్లవి ప్రశాంత్‌కు షాక్! బెయిల్ నిరాకరణ - మరో 16 మంది అరెస్టు!
Pallavi Prashanth News: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు షాక్ తగిలింది. అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.
Bigg Boss 7 Telugu Winner: బిగ్ బాస్ తెలుగు సీజన్ - 7 ఫైనల్ టెలికాస్ట్ అనంతరం జరిగిన అల్లర్ల ఘటనలో మరో 16 మంది అరెస్టు అయ్యారు. అల్లర్లలో భాగంగా ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో మరో 16 మందిని పోలీసులు గుర్తించారు. ఇందులో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లు ఉన్నారు. వీరిని కూడా పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు.
బెయిల్ నిరాకరణ
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు షాక్ తగిలింది. అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ప్రశాంత్ ను ఆయన సొంతిల్లు ఉన్న గజ్వేల్ నుంచి పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం చంచల్ గూడ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion