Watch Video: ఫ్రీగా చీరలిస్తామంటూ కంపెనీ ఆఫర్, ఓ శారీ కోసం కొట్టుకున్న మహిళలు - వైరల్ వీడియో
Watch Video: ఇద్దరు మహిళలు ఓ చీర కోసం కొట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
Watch Video:
చీర కోసం యుద్ధం
చీరలు, నగలు అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగలు, పబ్బాలతో సంబంధం లేకుండా కొందరు షాపింగ్ చేస్తూనే ఉంటారు. మరి కొందరు డబ్బులు దాచుకుని మరీ బంగారం కొంటారు. నచ్చిందంటే ఎంత కాస్ట్ అయినా సరే కొనేస్తారు. మామూలుగానే చీరలంటే తెగ ప్రేమించే మహిళలు...వాటిని ఫ్రీగా ఇస్తానంటే ఊరుకుంటారా..? ఎంత దూరమైనా సరే అడ్రెస్ కనుక్కొని మరీ వెళ్తారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఇలాంటి ఆఫరే పెట్టారు. ఏ చీర అయినా సరే ఫ్రీగా పట్టుకెళ్లండి అంటూ ప్రకటించింది మైసూర్ సిల్క్స్ (Mysore Silks). ఆ యాడ్ చూసిన వెంటనే పెద్ద ఎత్తున వచ్చేశారు మహిళలు. ఎవరికి నచ్చినవి వాళ్లు తీసుకున్నారు. కానీ ఆ తరవాతే ఉన్నట్టుండి అక్కడ అలజడి రేగింది. ఓ చీర కోసం ఇద్దరి మహిళలు గొడవ పడ్డారు. నాదంటే నాదంటూ కొట్టుకున్నారు. ఈ ఫైట్ ఎక్కడి వరకూ వెళ్లిందంటే...ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని మరీ లాక్కున్నారు. చుట్టూ ఉన్న వాళ్లంతా ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించినా అస్సలు పట్టించుకోలేదు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది పరిగెత్తుకొచ్చింది. ఇద్దరినీ వెనక్కి లాగే ప్రయత్నం చేసింది. అయినా ఊరుకోలేదు. ఒకరినొకరు చెంప దెబ్బలు కొట్టుకుంటూ మరింత రెచ్చిపోయారు.
వైరల్ అయిన వీడియో
Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.👆🤦♀️RT pic.twitter.com/4io5fiYay0
— RVAIDYA2000 🕉️ (@rvaidya2000) April 23, 2023
మహిళలతో కిటకిటలాడుతున్న ఆ షాపింగ్ మాల్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అయినా పక్కనున్న వాళ్లు మాత్రం ఏమీ పట్టించుకోకుండా తమకు నచ్చిన చీరల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓ వ్యక్తి ఈ తతంగాన్నంతా వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అయింది. అప్పుడే లక్ష మంది ఈ వీడియోని చూశారు. నెటిజన్‌లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "పక్కన అంత గొడవ జరుగుతున్నా..ఏమీ పట్టనట్టు షాపింగ్ చేస్తున్నారు" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో యూజర్ అయితే "శారీ అంటే జస్ట్ ఓ క్లాత్ కాదు. అదో ఎమోషన్" అంటూ సినిమా లెవెల్‌లో డైలాగ్ పోస్ట్ చేశాడు. డబ్బులు, ఆస్తుల కోసమే కాదు. చీరల కోసం కూడా కొట్టుకునే వాళ్లున్నారు మన దేశంలో అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Shows in what great demand their sarees are. This video can be shown as an advertisement.
— Amrit (@AmritHallan) April 23, 2023
I like the ones who are shopping without even turning their heads to see what's happening ..... oblivious of the ruckus. 😂😂😂
— Thinking Hearts (@ThinkingHearts) April 23, 2023
Also Read: Wrestlers Protest: సుప్రీంకోర్టుని ఆశ్రయించిన రెజ్లర్లు,బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని పిటిషన్