(Source: Poll of Polls)
Wrestlers Protest: సుప్రీంకోర్టుని ఆశ్రయించిన రెజ్లర్లు,బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని పిటిషన్
Wrestlers Protest: జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
Indian Wrestlers Protest:
కొనసాగుతున్న ఆందోళన
ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ రెజ్లర్లు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నిరసన కొనసాగుతోంది. రాత్రి పూట కూడా అక్కడే ఉన్నారు రెజ్లర్లు. బ్రిజ్ భూషణ్‌పై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇంకా ఆయనపై కేసు నమోదు చేయకపోవడంపై మండి పడుతున్నారు. ఇప్పటి వరకూ పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు రెజ్లర్లు. బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రెజ్లర్ల తరపున న్యాయవాదులు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని పిటిషన్ వేశారు. అయితే...ఆదివారం కావడం వల్ల ఇప్పటి వరకూ ఆ పిటిషన్ నమోదైనట్టు అధికారికంగా గుర్తించలేదు. పిటిషన్ నంబర్ కూడా జనరేట్ కాలేదు. పిటిషన్‌ల లిస్ట్‌లో చోటు దక్కితే కానీ సుప్రీం కోర్టు దీనిపై విచారణ చేపట్టేందుకు అవకాశముండదు. ప్రస్తుతానికైతే లాయర్లు ఈ పిటిషన్‌పై పూర్తి వివరాలు ఇవ్వడం లేదు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసేలా చొరవ చూపే విధంగా పోరాటం చేస్తున్నారు.
Vinesh Phogat and seven other wrestlers move Supreme Court seeking registration of FIR against Wrestling Federation of India (WFI) president, Brij Bhushan Singh pic.twitter.com/D7ptm2DSbf
— ANI (@ANI) April 24, 2023
Podium से फुटपाथ तक।
— Vinesh Phogat (@Phogat_Vinesh) April 23, 2023
आधी रात खुले आसमान के नीचे न्याय की आस में। pic.twitter.com/rgaVTM5WGK
బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ గతంలోనూ నినదించారు. అయినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. పోలీసుల తీరుని నిరసిస్తూ మరోసారి నిరసన వ్యక్తం చేశారు. మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఇంకా FIR నమోదు కాలేదు. ఈ నిర్లక్ష్యంపై రెజ్లర్ వినేష్ ఫోగట్ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులపై మండి పడ్డారు. వినేష్ ఫోగట్‌తో పాటు బజ్రంగ్ పునియా, సాక్షి మాలిక్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. జనవరిలోనూ దీనిపై నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం ఈ కేసుని విచారించేందుకు ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది. ఇప్పటి వరకూ ఆ రిపోర్ట్ విడుదల చేయలేదు. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బజ్రంగ్ పునియా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. "బ్రిజ్ భూషణ్‌ని అరెస్ట్ చేసేంత వరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు" అని వెల్లడించారు.
Also Read: Road Rage Case: కార్కి దారివ్వలేదని కొట్టి చంపారు, ఢిల్లీలో దారుణం - నిందితులు అరెస్ట్