అన్వేషించండి

New Education Model: వేదాలు, భగవద్గీత, కంప్యూటర్ సైన్స్ కలయికతో పాఠాలు: కొత్త విద్యా విధానంపై BSB యోచన

భారతీయ బోర్డ్ చైర్మన్ ఎన్పీ సింగ్ కంప్యూటర్ సైన్స్, వేదాలు, గీత వంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించాలని సూచించారు. పాఠశాలలు BSBలో చేరాలని ఆయన కోరారు.

భారతీయ శిక్షా బోర్డ్ (BSB) విద్యారంగంలో భారత సంస్కృతి, ఆధునిక విజ్ఞాన శాస్త్రం మధ్య సంబంధాన్ని నెలకొల్పడానికి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవల అలీగఢ్‌లో జరిగిన డివిజనల్ స్థాయి సింపోజియంలో BSB ఛైర్మన్ డాక్టర్ N.P. సింగ్ మాట్లాడుతూ.. పిల్లలను కేవలం భౌతికవాద విద్యకు మాత్రమే పరిమితం చేయకూడదని నొక్కి చెప్పారు. అందుకు బదులుగా కంప్యూటర్ సైన్స్ వంటి ఆధునిక సబ్జెక్ట్‌లతో పాటు వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తుల నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా బోధించాలన్నారు.

సాంస్కృతిక మూలాలతో విద్యార్థులు అనుసంధానం

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ ఎన్.పి సింగ్ మాట్లాడుతూ.. “ఈ కొత్త నమూనా సంస్కృతి, నీతివంతమైన, శాస్త్రీయంగా అవగాహన ఉన్న తరాన్ని సృష్టించడంపై ఫోకస్ చేసింది. ప్రపంచ పోటీకి వారిని సిద్ధం చేస్తూనే విద్యార్థులను వారి సాంస్కృతిక మూలాలతో అనుసంధానం చేయడమే లక్ష్యమని” చెప్పారు.

ఆధునిక పాశ్చాత్య విద్య ప్రభావంతో విద్యార్థులు నైతిక పతనాన్ని ఎదుర్కొంటున్నారు. భారత సంస్కృతి, విలువలు విద్యా వ్యవస్థలో క్షీణిస్తున్నాయని ఈ సందర్భంగా ఎన్పీ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్య వక్తగా ఆయన డివిజన్ అంతటా ఉన్న 300 మందికి పైగా పాఠశాల నిర్వాహకులు, ప్రిన్సిపాల్స్, ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపారు.

విలువలతో కూడిన విద్య

భారతీయ విద్యా బోర్డు ప్రధాన లక్ష్యం అత్యుత్తమ, విలువలతో కూడిన పిల్లలను అభివృద్ధి చేయడమేనని ఎన్పీ సింగ్ స్పష్టం చేశారు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి భారత సంస్కృతి, ఆధ్యాత్మిక బోధనలను ఆధునిక కంప్యూటర్ సైన్స్, ప్రకృతి ఆధారిత అభ్యాసంతో అనుసంధానించడం ద్వారా నీతితో మెలిగే పౌరులను తయారు చేయడానికి బోర్డు ప్రయత్నిస్తుంది. భారతదేశాన్ని బలమైన, “విశ్వగురు”గా తీర్చిదిద్దడానికి తమ పాఠశాలలను భారతీయ విద్యా బోర్డుతో అనుసంధానం చేయాలని అందరినీ ఆయన కోరారు.

పురాతన వేద సంస్కృతికి విద్యార్థులు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ సంగీత సింగ్ మాట్లాడుతూ.. పిల్లలకు విలువలను అందించడంలో తల్లిదండ్రులు, ఆదర్శ ఉపాధ్యాయులు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారని అన్నారు. పెద్ద పెద్ద భవనాలు ఉన్న పాఠశాలలకు మాత్రమే ఆకర్షితులు కాకుండా, విద్యార్థులు పురాతన వేద సంస్కృతికి తిరిగి రావాలి అన్నారు. భారతీయ విద్యా బోర్డుతో అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను ఆమె కోరారు.

(నిరాకరణ: ఇది స్పాన్సర్ చేసిన కథనం. ABP నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు/లేదా ABP దేశం ఈ కథనంలోని విషయాలను మరియు/లేదా ఇక్కడ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఏ విధంగానూ ఆమోదించదు/సబ్‌స్క్రైబ్ చేయదు.)

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget