Viral News: మార్నింగ్ వాక్‌కి వచ్చిన మహిళకు లైంగిక వేధింపులు, బలవంతంగా ముద్దు పెట్టి నిందితుడు పరారీ - వీడియో
Viral Video: బెంగళూరులో ఓ మహిళ మార్నింగ్ వాక్‌కి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. బలవంతంగా పట్టుకుని ముద్దు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
Viral News in Telugu: బెంగళూరులో ఓ మహిళ మార్నింగ్ వాక్ చేస్తుండగా ఓ వ్యక్తి వెంటపడ్డాడు. ఆ తరవాత ఆమెని లైంగికంగా వేధించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆగస్టు 2వ తేదీన ఉదయం 5 గంటలకు ఈ ఘటన జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతోంది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితారులు ఓ ఇంటి ముందు నిలబడి ఉంది. అక్కడి నుంచి ఓ వైపు నడుచుకుంటూ వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తిని ఆమెని వెంబడించాడు. చుట్టూ ఎవరు లేనిది చూసి ఆమెని వెనక నుంచి బలవంతంగా పట్టుకున్నాడు. ఆ తరవాత ముద్దు పెట్టాడు. ఈలోగా ఆమె కేకలు వేసింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు నిందితుడు. వదిలించుకోడానికి ఆమె ఎంత ప్రయత్నించినా వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఎలాగోలా ఆ మహిళ ఆ పట్టు నుంచి తప్పించుకుంది. ఇది గమనించి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి భర్త కూడా ఫిర్యాదు చేయడం వల్ల విచారణ ముమ్మరం చేశారు.
Woman molested in Bengaluru while she was out on a morning walk. The man fled the spot soon after and a case against him was registered. Efforts are on to nab him.#Bengaluru pic.twitter.com/k8xlSOvXK7
— Vani Mehrotra (@vani_mehrotra) August 5, 2024