అన్వేషించండి

Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం

Ayodhya Lawyers Refuse: అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో అరెస్ట్ అయిన నిందితుల తరఫున ఏ న్యాయవాదీ వాదించకూడదని లాయర్లు నిర్ణయించారు. ధిక్కరించిన లాయర్లకు జరిమానా విధిస్తారు.

Ram Temple Donation: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల దుర్వినియోగం ,  చోరీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న వేళ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాధుల సంఘం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రామాలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల చోరీ కేసులో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం   ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసింది.  అయితే, ఈ నిందితుల తరఫున ఫైజాబాద్  బార్ అసోసియేషన్‌కు చెందిన ఏ ఒక్క లాయర్ కూడా కోర్టులో వకాలత్ పుచ్చుకోకూడదని, వారి తరఫున వాదించకూడదని బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది.

సోమవారం జరిగిన బార్ అసోసియేషన్ జనరల్ బాడీ అత్యవసర సమావేశంలో ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ తీసుకున్న ఈ సామూహిక నిర్ణయాన్ని ఎవరైనా న్యాయవాది అతిక్రమించి, నిందితులకు లీగల్ సపోర్ట్ ఇస్తే.. సదరు లాయర్‌కు రూ.5 లక్షల భారీ పెనాల్టీ  విధిస్తామని అసోసియేషన్ ప్రెసిడెంట్ కాళికా ప్రసాద్ మిశ్రా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అధికారికంగా చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దేవుడికి సమర్పించిన కానుకలను దొంగిలించడం ద్వారా నిందితులు కోట్లాది మంది హిందువుల, భక్తుల సెంటిమెంట్లను తీవ్రంగా గాయపరిచారని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బార్ అసోసియేషన్ సెక్రటరీ శైలేంద్ర జైస్వాల్ వెల్లడించారు.
  
 ఫైజాబాద్ బార్ అసోసియేషన్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2005 లో అయోధ్యలోని తాత్కాలిక రామాలయంపై ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలోనూ.. సదరు ఉగ్రవాదుల తరఫున స్థానిక లాయర్లు ఎవరూ కోర్టులో వాదించకూడదని బార్ అసోసియేషన్ అప్పట్లోనే చారిత్రాత్మక తీర్మానం చేసింది. 

ఈ సాధారణ సర్వసభ్య సమావేశంలో న్యాయవాదులు కేవలం నిందితులను దూరం పెట్టడమే కాకుండా.. ఈ వివాదంతో సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, మాజీ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, అకౌంట్స్ ఆఫీసర్ గోపాల్ రావులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు ముగ్గురూ రాబోయే మూడు రోజుల్లోగా అయోధ్య నగరాన్ని విడిచి వెళ్లాలని, లేనిపక్షంలో అయోధ్య నగరాన్ని పూర్తిగా స్తంభింపజేస్తామని న్యాయవాదుల సంఘం అల్టిమేటం జారీ చేసింది. కాగా, ఈ వివాదం ముదరడంతో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు ఇప్పటికే తమ ట్రస్ట్ పదవుల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.  

ఈ విరాళాల కుంభకోణంపై ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన సెట్  లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి, వారి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసు తీవ్రతను బట్టి దీనిపై కేవలం స్థానిక పోలీసుల దర్యాప్తు సరిపోదని.. కోర్టు ద్వారా సెక్షన్ 156(3) కింద చంపత్ రాయ్, ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ  కి ఈ కేసును అప్పగించేలా చట్టపరంగా పోరాడతామని బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget