Sudha Murthy: ఆమె కాళ్లకు దండం పెట్టిన ఇన్‌ఫోసిస్ సుధామూర్తి, ఫైర్ అవుతున్న నెటిజన్లు
Sudha Murthy: ఇన్‌ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తి మైసూర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాళ్లకు నమస్కరించటం వివాదాస్పదమైంది.
Sudha Murthy:
మైసూర్ రాయల్ ఫ్యామిలీ మెంబర్‌కి దండం..
ఇన్‌ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రచయిత్రిగా, సామాజిక సేవకురాలిగా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె స్పీచ్‌లకూ బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు సుధామూర్తి. అయితే...ఈ మధ్య ఆమె చేసిన ఓ పని...విమర్శలకు తావిస్తోంది. మైసూర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రమోద దేవి వడియార్ కాళ్లకు సుధామూర్తి దండం పడిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమెతో పాటు ప్రముఖ నటి బి.సరోజ దేవి కూడా ఈ ఫోటోలో ఉన్నారు. 2019లో తీసిన ఈ ఫోటో ఇప్పుడు వివాదానికి దారి తీసింది. మైసూర్ స్టేట్ చివరి పాలకుడైన జయచమరాజా వడియార్ పుట్టినరోజు వేడుకలకు... సుధామూర్తికి ఆహ్వానం అందింది. అప్పుడు దిగిన ఫోటో ఇది. మైసూర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన శ్రీకాంత దత్త నరసింహరాజ వడియార్ భార్య...ప్రమోద దేవి వడియార్‌కు దండం పెట్టారు సుధామూర్తి. ఈ వయసులో ఆమె వంగి దండం పెట్టాల్సిన పనేంటని కొందరు వాదిస్తుంటే... ఇంకొందరు అది గౌరవం అంటూ వాదిస్తున్నారు. ఓ నెటిజన్ ట్విటర్‌లో ఈ ఫోటో షేర్ చేశాడు. "సుధామూర్తి మైసూర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తికి ఇలా దండం పెడుతున్నారు. ఆమెను అంతా రోల్‌మోడల్‌గా చూస్తున్నారు. ఇండియాలో ఓ రాయల్ ఫ్యామిలీ సభ్యులను ఇలా పలకరించాలా..? ఇది కేవలం గౌరవం అనే అనుకుందామా?" అని ప్రశ్నించాడు. మరో నెటిజన్ కూడా ఇదే ఫోటోను షేర్ చేస్తూ.."సుధామూర్తి అందరికీ రోల్‌మోడల్. అలాంటి వ్యక్తి ఇలా రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తికి వంగి దండాలు పెట్టటం ఏంటి" అని అసహనం వ్యక్తం చేశాడు.
Sudha Murthy bowing before a member of the mysore royal family. She is supposed to be a role model.
— Kamran (@CitizenKamran) September 26, 2022
Is this still a tradition of greeting the members of Royal family in India?
Or was it more like an action out of reverence or respect? pic.twitter.com/1xSedjLXXB
Look at Sudha Murthy bowing before a member of the mysore royal family. She is supposed to be a role model. https://t.co/6KhT7vTyOd
— ವಿನಯ್ ಕೂರಗಾಯಲ ಶ್ರೀನಿವಾಸ Vinay K S (@vinaysreeni) September 25, 2022
I have great respect for Mrs Sudha Murthy. Her books inspired many women to look up and move on. Her prostration to the royal is an emotional expression and she is more royal than the Mysore royal family.
— Santhanam Srinivasan (@santhraj5) September 27, 2022
అది ఆమె వ్యక్తిగతం..
కొందరు నెటిజన్లు మాత్రం సుధామూర్తికి సపోర్ట్‌గా నిలిచారు. "నాకు సుధామూర్తి గారంటే ఎంతో అభిమానం. ఆమె రచనలు మహిళలకు స్ఫూర్తినిచ్చాయి. రాయల్ ఫ్యామిలీ సభ్యురాలిని చూసి ఆమె ఎమోషన్ అయ్యారంతే. నిజానికి...రాయల్ ఫ్యామిలీ వాళ్లకన్నా...సుధామూర్తిగారే రాయల్‌గా ఉంటారు" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరికొందరు...అది ఆమె వ్యక్తిగతం అని కామెంట్ చేస్తున్నారు. ఇందులో డిబేట్ చేయాల్సిన అవసరం లేదని కొట్టి పారేస్తున్నారు.
Also Read: Singareni Employees Bonus: సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, దసరా కానుక ప్రకటన