Assembly Elections 2022: ఓవైపు భాజపా సీఈసీ భేటీ.. మరోవైపు 2 రోజుల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఔట్
యూపీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసేందుకు మోదీ నేతృత్వంలో భాజపా సీఈసీ భేటీ అయింది. మరోవైపు ఇప్పటికే 2 రోజుల్లో భాజపా నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై గత రెండు రోజులుగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాగూర్, ధర్మేంద్ర ప్రధాన్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్లు వర్చువల్గా హాజరయ్యారు.
రెండు రోజుల్లో..
ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటి, రెండో విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

