అన్వేషించండి

Arunachal Pradesh: ఉన్నట్టుండి మాయమైన సైనికులు, భారత్‌-చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది

అరుణాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు భారత సైనికులు గల్లంతవటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకూ వారి ఆచూకీ లభించలేదు.


భారత్, చైనా సరిహద్దుల్లో జవాన్లు గల్లంతు

అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో భారత్‌తో చైనా ఎలా కయ్యం పెట్టుకుంటుందో ప్రపంచమంతా తెలిసిన విషయమే. సరిహద్దు వివాదం చెలరేగిన ప్రతిసారీ అరుణాచల్‌ప్రదేశ్‌ అంశాన్నీ ప్రస్తావించటం డ్రాగన్ దేశానికి అలవాటు. అందుకే ఎప్పుడూ ఈ రాష్ట్రం వార్తల్లో నిలుస్తుంది. దాదాపు పదిరోజులుగా మరోసారి దేశవ్యాప్తంగా అరుణాచల్ ప్రదేశ్ పేరు మారుమోగుతోంది. ఇందుకు కారణం..ఈ ప్రాంతంలో ఇద్దరు భారత సైనికులు కనిపించకుండా పోవటం. భారత్-చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు జవాన్లు గల్లంతవటం చర్చనీయాంశమైంది. గత నెల 28వ తేదీ నుంచే వీళ్లు కనిపించకుండా పోయినట్టు సమాచారం. గల్లంతైన సైనికులు ఉత్తరాఖండ్‌కు చెందిన హరేంద్ర నేగి, ప్రకాశ్‌ సింగ్‌ రాణాగా ఉన్నతాధికారులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకూ సమాచారం అందించారు. అప్పటి నుంచి వాళ్లు కంటి మీద కునుకు లేకుండా నిరీక్షిస్తున్నారు. అయితే భారత సైన్యం మాత్రం ఈ విషయంపై ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు. తన భర్త కనిపించటం లేదంటూ గత నెల మే29వ తేదీన తనకు అధికారులు కాల్ చేసి చెప్పారని ప్రకాశ్ రాణా భార్య మమతా రాణా ఓ వార్తా సంస్థకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవలే మరోసారి కాల్ చేసి వాళ్లిద్దరూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి చనిపోయినట్టు భావిస్తున్నామని అధికారులు చెప్పినట్టు మమత చెబుతున్నారు. ఈ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అసలేం జరిగిందో అధికారులు వివరంగా చెప్పాలని కోరుతున్నారు. ఇప్పటికే అధికారులు అందించిన సమాచారంతో ఇద్దరి సైనికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. 


అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా అభ్యంతరాలేంటి..? 

అంతర్జాతీయ చిత్రపటాల్లో అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగానే ఉంది. చైనా మాత్రం టిబెట్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్‌ కూడా తమదేనని వాదిస్తోంది. ఈ ప్రాంతం దక్షిణ టిబెట్‌ అని పదేపదే చెబుతోంది. మొదట్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్‌ ఉత్తర భాగం తమదేనని చైనా చెప్పేది. ఇక్కడ భారత దేశంలోనే అతిపెద్ద బౌద్ధ మందిరం ఉంది. చైనా-భారత్ మధ్య మెక్‌మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దు రేఖగా భావిస్తారు. కానీ చైనా దాన్ని అంగీకరించటం లేదు. టిబెట్‌లో అత్యధిక భాగం భారత్ అధీనంలో ఉందని ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోంది. 1950వ దశకం చివర్లో టిబెట్‌ను తనలో కలుపుకుంది చైనా. తరవాత అక్సాయ్ చీన్‌ నుంచి సుమారు 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించింది. చైనా ఇక్కడే నేషనల్ హైవే 219 నిర్మించింది. అది దీనిని తూర్పు ప్రాంతం షింజియాంగ్‌కు జోడిస్తుంది. భారత్ మాత్రం దీన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని విమర్శిస్తోంది. ఇలా అరుణాచల్‌ ప్రదేశ్‌ కేంద్రంగా చైనా, భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
 Hockey Saffron Jersey: సాంప్రదాయ బ్లూ డ్రెస్‌కు గుడ్ బై.. క‌షాయ‌రంగు జెర్సీ రచ్చపై హాకీ ఇండియా వివరణ, జెర్సీ మార్పు వెనుక అస‌లు ట్విస్ట్ ఇదే!
సాంప్రదాయ బ్లూ డ్రెస్‌కు గుడ్ బై.. క‌షాయ‌రంగు జెర్సీ రచ్చపై హాకీ ఇండియా వివరణ, జెర్సీ మార్పు వెనుక అస‌లు ట్విస్ట్ ఇదే!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget