Vijay Malya : జనవరిలో విజయ్ మాల్యాకు శిక్ష ఖరారు చేయనున్న సుప్రీంకోర్టు !
విజయ్ మాల్యాను తీసుకొస్తారని ఇక వెయిట్ చేయలేమని.. ఆయనకు శిక్ష ఖరారు చేస్తామని ఓ కంటెంప్ట్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనవరి 18న శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.
బ్యాంకులను మోసగించి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాకు సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు జనవరిలో శిక్ష ఖరారు చేయనుంది. గతంలో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి విదేశాల్లో ఉన్న తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆయనను 2017లో దోషిగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది.ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇప్పటికే తగినంత సమయం వేచి చూశామని, ఇంకా వేచి ఉండలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read : 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'
యూకేలో ఉంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మాల్యాను బ్రిటన్ నుంచి రప్పించేందుకు వేచి ఉండలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2022 జనవరి 18న మాల్యాకు విధించే శిక్షను ఖరారు చేయనున్నట్టు తెలిపింది. మాల్యా వ్యక్తిగతంగా హాజరుకావాలని లేదా అతని న్యాయవాది ద్వారా వాదనలను వినిపించాలని న్యాయమూర్తి లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం కోరింది. శిక్ష ఖరారు మాత్రమే పెండింగ్‌లో ఉంది. జనవరి 18న శిక్ష ఖరారు చేసేఅవకాశం ఉంది.
Also Read : 'ఒమిక్రాన్'పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు.. ఇవి తప్పనిసరి!
విజయ్ మాల్యాను బ్రిటన్ అప్పగించడం లేదు. అక్కడి కోర్టులో విజయ్ మాల్యా ఓడిపోయారు. జూన్‌లో ఆయనను ఇక భారత్ తరలించడమే మిగిలిందని అనుకున్నారు. యూకే సుప్రీంకోర్టు కూడా మాల్యాను ఇండియాకు పంపడానికి అంగీకరించిన తర్వాత... ఇంకే న్యాయ అవకాశమూ మాల్యాకు లేదని భావించారు. కానీ బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను ఇండియాకు అప్పగించే ఆలోచన ఏదీ లేదని ప్రకటిచేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. దీంతో సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో.. ఆయనను ఎప్పుడు ఇండియాకు తీసుకు వస్తారో స్పష్టత లేకుండా పోయింది.
lso Read: 12 MP Suspension: ఎంపీల సస్పెన్షన్‌పై వెనక్కి తగ్గని వెంకయ్య.. విపక్షాలు వాకౌట్
భారత్‌లో బ్యాంకులకు విజయ్ మాల్యా రూ.పదకొండు వేల కోట్లకుపైగా బాకీ ఉన్నారు. ఆయన ఆస్తులన్నీ జప్తు చేశారు. అయితే..లండన్ పారిపోయిన ఆయన ప్రశాంతంగా జీవించేస్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసినా ఆయన ఇండియాకు వచ్చిన తర్వాతే అమలు చేస్తారు.
Also read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి