News
News
X

RGV Tweet: చంద్రబాబు, పవన్ భేటీపై వర్మ ట్వీట్ దుమారం, మండిపడుతున్న ఏపీ కాపు నేతలు

దర్శకుడు రాంగోపాల్ వర్మ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ప్యాకేజీల కోసం కామెంట్లు చేయటం వర్మకు అలవాటని కాపు నాడు నేతలు సీరియస్ అయ్యారు..

FOLLOW US: 
Share:

దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాపు నాడు నేతలు, వర్మ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ప్యాకేజీల కోసం కామెంట్లు చేయటం వర్మకు అలవాటని కాపు నాడు నేతలు సీరియస్ అయ్యారు..
వర్మపై కాపు నేతల మండిపాటు...
ప్యాకేజీల కోసం కాపులపై కామెంట్లు చేస్తే చెప్పు దెబ్బలు తినాల్సి వస్తోందని బెజవాడ కాపు నాడు నాయకులు వర్మకు హెచ్చరికలు జారీ చేశారు. కాపులను రాజకీయ కారణాలు పేరు చెప్పి విభజించాలనే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టాలని వైసీపీ నేతలు వర్మ లాంటి వాళ్లను వదులుతున్నారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కాపుల కోసం అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని, కాపు జాతి గురించి ప్రేమ ఉంటే వైసీపీ అధినేతను నిలదీయాలని వర్మకు సూచించారు. వైసీపీ లో ఉన్న కాపు నేతలు నోళ్లు అదుపులో పెట్టుకోవాలన్నారు. కాపు జాతి గురించి మాట్లాడే వారు కాపులకు ఏమైనా చేశారా చెప్పాలన్నారు. రాంగోపాల్ వర్మ కు సిగ్గు శరం ఏమాత్రం లేదని, జగన్ దగ్గర ప్యాకేజీ తీసుకుని వాగుతున్నాడని వ్యాఖ్యానించారు. వర్మ నోరు అదుపులో పెట్టుకోవాలని కాపు జాతిని అవమానించడం దుర్మార్గమని అన్నారు. గతంలో వంగవీటి మోహన రంగా పై సినిమా తీసి డబ్బులు దండుకున్న వర్మ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే.. నీకు తగిన బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు. పోస్టులు వెనక్కి తీసుకుని కాపు జాతికి రాంగోపాల్ వర్మ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కులాల చిక్కుకు కారణం అవుతున్న వర్మ పై కేసు పెట్టాలి...
కులాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని కాపు నేతలు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం బూతులతో వ్యాఖ్యలు చేసే వర్మ, రాజకీయాలకు సంబంధించిన విషయాలను, రెండు కులాలకు ఆపాదించి చేసిన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, వర్మ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించారు. వర్మ తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకొని, వరుసగా వివాదాలకు కేంద్రం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నితమయిన అంశాలను రెచ్చగొట్టే విదంగా వ్యవహరించిన వర్మ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ట్విట్ దుమారం...
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ భేటీపై రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. డబ్బు కోసం కాపులను కమ్మ వాళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు, కంగ్రాట్స్ కమ్మ వాళ్ళు" అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లోనే కాక అటు కాపు, కమ్మ కులాల్లోనూ దుమారానికి కారణం అయ్యాయి. నిత్యం సంచలనాలు రేకెత్తించే కామెంట్స్ చేసే వర్మ ఈ సారి రాజకీయంగా, కులాలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ పై తీవ్ర చర్చ జరుగుతోంది.
టీడీపీ నేత బుద్దా కౌంటర్...
వర్మ ట్వీట్ కి టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. “కామంతో కాళ్లు నాకావ్ అనుకున్నా కానీ పే టీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదనిన కామెంట్స్ చేశారు. RIP ఆర్జీవీ, కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటూ రీ ట్వీట్ తో రిప్లై ఇచ్చారు.అటు టీడీపీ నేతలు కూడా వర్మ వ్యవహర శైలిని తప్పుబడుతున్నారు. రాజకీయాలకు సంబందించిన అంశాలను కులానికి ముడిపెట్టడం తగదని ఫైర్ అవుతున్నారు.

Published at : 09 Jan 2023 08:36 PM (IST) Tags: YSRCP Ram Gopal Varma Pawan Kalyan Chandrababu TDP

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price 30 January 2023: తిరుపతిలో భారీగా పెరిగిన పెట్రోల్‌ రేటు, తెలంగాణలో స్థిరంగా ధరలు

Petrol-Diesel Price 30 January 2023: తిరుపతిలో భారీగా పెరిగిన పెట్రోల్‌ రేటు, తెలంగాణలో స్థిరంగా ధరలు

Gold-Silver Price 30 January 2023: ₹58 వేలను దాటేలా కనిపిస్తున్న పసిడి, కొద్దికొద్దిగా పెరుగుతోంది

Gold-Silver Price 30 January 2023: ₹58 వేలను దాటేలా కనిపిస్తున్న పసిడి, కొద్దికొద్దిగా పెరుగుతోంది

ABP Desam Top 10, 30 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 30 January 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ

-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!