Maharastra Elections: మహారాష్ట్రలో ఇంచార్జులుగా పని చేసిన ఏపీ బీజేపీ నేతలకు మంచి ఫలితాలు - హైకమాండ్ వద్ద మార్కులు కొట్టేసినట్లే !
AP BJP: మహారాష్ట్రలో పని చేసిన ఏపీ బీజేపీ నేతలకు మంచి ఫలితాలు వచ్చాయి. విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, మధుకర్‌లకు పలు ప్రాంతాల్లో బాధ్యతలు ఇచ్చారు.
AP BJP leaders who worked in Maharashtra got good results: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది బీజేపీ నేతలకు కూడా సంతోషాన్నిస్తోంది. ఎందుకంటే ముగ్గురు నేతలకు అక్కడ ఇంచార్జ్ పదవులు ఇచ్చారు. దాదాపుగా నెల రోజుల పాటు వారు తమకు ఇచ్చిన ప్రాంతాల్లో విస్తృతంగా కృషి చేశారు. వారి కృషికి తగ్గ ఫలితం వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి , పీవీఎన్ మాధవ్ తో పాటు సీనియర్ నేత మధుకర్ కు మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక బాధ్యతలు ఇచ్చారు. షెడ్యూల్ వచ్చిన వెంటనే నాందేడ్ జిల్లాకు విష్ణువర్ధన్ రెడ్డిని, మరఠ్వాడా ప్రాంతానికి మధుకర్, పీవీఎన్ మాధవ్‌కు వాసిక్ ఇంచార్జుగా బాధ్యతలు ఇచ్చారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చోట్ల వీరికి ఇచ్చిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహించారు.
Also Read: పని చేయని రేవంత్ మ్యాజిక్ - పవనే హైలెట్ - మహారాష్ట్ర ఫలితాలపై తెలుగు నేతల ప్రభావం
ఎన్నికల ఇంచార్జ్ గా విధులు బీజేపీలో కీలకంగా ఉంటాయి. క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయడం మాత్రమే కాకుండా.. ప్రచార సరళిని సమన్వయం చేయడం, అభ్యర్థికి పార్టీకి మధ్య సమన్వయం చేయడం, ఓటర్లను నేరుగా కలిసే బృందాలకు దిశానిర్దేశం చేయడం వంటివి చేస్తూంటారు. వీరు రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ప్రచారాన్ని కూడా పకడ్బందీగా సమన్వయం చేసుకున్నారు. తెలుగు ఓటర్లపై ప్రభావం చూపేలా చేయగలిగారు.
నెల రోజుల పాటు ఎలక్షనీరింగ్ ప్రక్రియలను కూడా పరిశీలించారు. ప్రచారం చివరి రోజు వరకూ వారు వారికి ఇచ్చిన నియోజకవర్గాల్లో పని చేశారు. ఎలక్షనీరింగ్ వ్యూహం ఖరారు చేసి వచ్చారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో @JanaSenaParty ఏపీ డిప్యూటీ @PawanKalyan సీఎం పవన్ కల్యాణ్ గారు , @BJP4India జాతీయ కార్యదర్శి
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 23, 2024
సత్యకుమార్ గారు @satyakumar_y ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీకి ఆధిక్యం.
భోకర్,బల్లార్పూర్, పుణె, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్‌లో పవన్ ప్రచారం.. పుణె,… pic.twitter.com/avteDisarE
Also Read: మహారాష్ట్ర సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ -బీజేపీ సునామీతో మారిపోనున్న లెక్కలు!
మహారాష్ట్ర విజయంలో తాము కూడా పాలు పంచుకున్నందుకు నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాందేడ్ ఎంపీ సీటులో కూడా బీజేపీ విజయం సాధించింది.
Massive mandate for Mahayuti in #Maharashtra! 🚩
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 23, 2024
With 50% vote share and leading on 222 seats, the people have shown their unwavering trust in PM Shri @narendramodi ji's vision for a prosperous future.
Thank you, Maharashtra, for your faith and support! This is just the… pic.twitter.com/obBgucMqut