(Source: ECI/ABP News/ABP Majha)
Maharastra Elections: పని చేయని రేవంత్ మ్యాజిక్ - పవనే హైలెట్ - మహారాష్ట్ర ఫలితాలపై తెలుగు నేతల ప్రభావం
Telugu Leaders: మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన తెలుగు నేతలు భిన్నమైన ఫలితాలను చూశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది.
Telugu leaders who campaigned in the Maharashtra elections saw mixed results: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఇన్వాల్వ్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ప్రచారం చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన సోదరుడి మరణం కారణంగా రద్దు అయింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం రెండు రోజుల పాటు ప్రచారం చేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసినచోట మంచి ఫలితాలు రాగా.. రేవంత్ ప్రచారం చేసి చోట కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రాలేదు.
పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీకి విజయాలు
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూ వాటా ఉందని అనుకోవచ్చు. తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న పూణె, బల్లాల్ పూర్, షోలా పూర్, తాలూర్, డెగ్లూర్ లాంటి నియోజక వర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. రోడ్ షోలు నిర్వహించారు. ఈ అన్ని చోట్లా.. బీజేపీ కూటమికి మంచి ఫలితాలు వచ్చాయి. పవన్ రోడ్ షోలకు అక్కడ భారీ స్పందన కనిపించింది. పవన్ సనాతన ధర్మం గురించీ, హిందుత్వం గురించి తన ప్రసంగాలు అక్కడి ఓటర్లని బీజేపీ వైపు చూసేలా చేశాయి. ఆ ప్రభావం ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఎన్డీఏ కూటమి విజయం తర్వాత పవన్ ను ఇతర రాష్ట్రాల్లో ప్రచారం కోసం మొదటి సారి ఉపయోగించుకున్నారు. మంచి ఫలితాలు సాధించారు.
Also Read: మహారాష్ట్ర సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ -బీజేపీ సునామీతో మారిపోనున్న లెక్కలు!
రేవంత్ స్టార్ క్యాంపెయినింగ్ ఫెయిల్
మరో వైపు తెలగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. ఆయన మూడు, నాలుగు విడతలగు ప్రచారం చేశారు.ముంబైలో రోడ్ షోలు నిర్హవించారు. అయితే ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడా విజయం సాధించలేదు. దీంతో ఆయనపై ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి పది సార్లు పోయి ప్రచారం చేసినా ఆయన ప్రచారం చేసిన చోట ఓడిపోయారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మలేదని అందుకే అక్కడ ఓడించారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
ఒక్క ప్రచారం వల్లే అంతా మారుతుందా ?
అయితే వీరు తమ తమ కూటమి లేదా పార్టీల కోసం ప్రచారం చేశారు కానీ గెలుపోటములు వీరి వల్లనే నిర్ణయం అవుతాయన్నది కరెక్ట్ కాదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తమ రాష్ట్రంలో పరిస్థితుల్ని బట్టి ఓటర్లు ఓటు వేస్తారు కానీ పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరో చెప్పారని ఓట్లు వేయరని అంటున్నారు. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని చూసి మహారాష్ట్రలో ఓట్లు ఎలా వస్తారన్న సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే ఆయా నేతల్ని పొగడటానికి లేదా విమర్శించడానికి ఈ ఫలితాల్ని ఇలా ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు.