By: ABP Desam | Updated at : 20 Dec 2022 11:20 AM (IST)
Edited By: jyothi
ప్రైవేటీకరణ జాబితాలో ఏపీలోని మూడు విమానాశ్రయాలు!
AP Airports Privatization: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ కింద 2022-25 మధ్య కాలంలో దేశంలోని 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అందులో ఈ మూడు విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. విమానాశ్రయాల ప్రైవేటీకరణపై సోమవారం రాజ్య సభలో కేరళ సీపీఎం సభ్యుడు ఎలమారం కరీం అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయం తెలిసింది. ఇప్పటి వరకు దేశంలోని 8 విమానాశ్రయాలను పీపీపీ విధానంలో లీజుకు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఏపీ ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మిస్తున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు 2,203 ఎకరాలు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 2,160.47 ఎకరాలు సేకరించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వివరించారు.
రాజ్యసభలో టీడీపీ, బీజేపీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, జీవీఎల్ నరసింహారావులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఈ విమానాశ్రయ నిర్మాణానికి రూ.2500 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం విమానాశ్రయం తొలి దశ పూర్తి అయితే ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల అవసరాలు తీర్చగల్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇచ్చి స్థలానుమతి ప్రకారం ఈ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత 30 ఏళ్ల పాటు వైజాగ్ నావల్ ఎయిర్ ఫీల్డ్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలు నడపకూడదని అన్నారు. ఆ తర్వాత ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అసరాలకు తగ్గట్లు షెడ్యూల్డ్ విమానాలు నడుపుకోవచ్చని వివరించారు. 2022 శీతాకాల షెడ్యూల్ ప్రకారం ఏపీలోని మూడు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి 15 అంతర్జాతీయ విమానాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
గతంలోనే విమానాశ్రయాల ప్రైవేటీకరణకు నిర్ణయం..
2024 ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల ప్రైవేటీకరణ చేపట్టి 860 కోట్ల రూపాయలను రాబట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణ ద్వారా ఎనిమిది వందల కోట్లు, తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణ ద్వారా 260 కోట్లు, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణ ద్వారా 130 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా ముందుకు వెళ్తుంది. 2024లో తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ చేయాలని భావించిన 2024 కంటే ముందే తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించడానికి బిడ్డింగ్ కి వెళ్తుంది. ఆ తర్వాత జరగబోయే బిడ్డింగ్ లలో విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా ప్రైవేటీకరణ బాట పట్టిన కేంద్రం కష్టాల్లో ఉన్న బ్యాంకులను, పలు పరిశ్రమలను, ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరణ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నాయి. అందులో 24 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండగా, 10 కస్టమ్స్ విమానాశ్రయాలు, 103 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. కేంద్ర విమానాశ్రయాలు ప్రైవేటీకరణ నిర్ణయంతో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆ దిసగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తూ విమానాశ్రయాల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తోంది.
Weather Latest Update: నేడు వాయుగుండంగా అల్పపీడనం, ఏపీకి వర్ష సూచన - ఈ ప్రాంతాల్లోనే
ABP Desam Top 10, 30 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Petrol-Diesel Price 30 January 2023: తిరుపతిలో భారీగా పెరిగిన పెట్రోల్ రేటు, తెలంగాణలో స్థిరంగా ధరలు
Gold-Silver Price 30 January 2023: ₹58 వేలను దాటేలా కనిపిస్తున్న పసిడి, కొద్దికొద్దిగా పెరుగుతోంది
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!