By: ABP Desam | Updated at : 25 Sep 2022 05:19 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
Ankita Bhandari Murder Case: ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత భండారి మృతికి గల కారణాలు ఆమె పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వైద్యులు వెల్లడించారు. డ్రౌనింగ్ కారణంగానే ఆమె చనిపోయినట్టు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. అయితే మృతికి ముందే అంకిత ఒంటిపై గాయాలు అయినట్టు కూడా నివేదిక తెలిపింది.
ఇదే కారణమా?
మునక కారణంగానే ఆమె మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదిక ధ్రువీకరించింది. రిషీకేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఈ ముసాయిదా నివేదికను విడుదల చేసింది. ఎయిమ్స్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం ఈ పోస్ట్‌మార్టం నిర్వహించింది. గాయాల వివరాలు, పోస్ట్‌మార్టంలో వెలికిచూసిన విషయాలను తుది నివేదకలో తెలియజేస్తామని ముసాయిదా నివేదక పేర్కొంది.
అంత్యక్రియలకు నో
అయితే పోస్ట్‌మార్టం తుది నివేదక తమకు అందేవరకూ అంకిత అంత్యక్రియులు జరిపేది లేదని ఆమె కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.
ఇదీ జరిగింది
హరిద్వార్‌కు చెందిన భాజపా నేత వినోద్ ఆర్య తనయుడు పుల్కిత్ ఆర్య యమకేశ్వర్‌లో వనతార రిసార్ట్‌ను నడుపుతున్నాడు. రిసార్ట్‌లో పౌరి జిల్లా శ్రీకోట్ గ్రామానికి చెందిన అంకితా భండారీ అనే 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్‌గా పని చేస్తుండేది. సెప్టంబర్ 19న ఆమె ఇంటికి రాలేదని అంకిత తండ్రి ఉదయపుర్ తల్లాలోని రాజస్వ చౌకీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా ఉన్నారు. మొదట కేసు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించిన నిందితులు.. పోలీసులు తమశైలిలో ప్రశ్నించేసరికి నిజాన్ని చెప్పేశారు.
మద్యం తాగించి
అంకితా భండారీని ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం తాగించినట్లు నిందితులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న అంకితను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశామని చెప్పారు. అంకితతో విభేదాలు రావడం వల్ల ఆమెను హత్య చేసినట్ల విచారణలో ఒప్పుకున్నారు.
కాలువలో యువతి మృతదేహాన్ని గాలించేందుకు పోలీసులు ఓ టీమ్‌ను పంపించారు. అంకిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఆ మృతదేహం అంకితదే అని ధ్రువీకరించారు.
అందుకే హత్య
రిసార్ట్ యజమానితో పాటు కొంతమంది ఉద్యోగులు అంకిత భండారిని అతిథులకు ప్రత్యేక సేవలు అందించమని కోరేవారని దానికి ఆమె నిరాకరించడం వల్ల వేధింపులకు గురిచేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు అంకిత వాట్సాప్ చాట్ ద్వారా చాలా విషయాలు వెల్లడయ్యాయని పోలీసులు తెలిపారు.
Also Read: North Korea: కిమ్ కవ్వింపు చర్యలు- సీరియస్‌గా స్పందించిన దక్షిణ కొరియా!
Also Read: UN Security Council: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత హోదా- రష్యా మద్దతు!
Telangana Assembly Dissolved: తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన గవర్నర్, ఉత్తర్వులు జారీ - కొత్త అసెంబ్లీకి గెజిట్ నోటిఫికేషన్
BRS MLA Kaushik Reddy: గెలిచిన ఆనందంలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి షాక్, మరో కేసు నమోదు
Mizoram Election Results 2023: ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్, ఇప్పుడు మిజోరం సీఎం - ఎవరీ లల్దుహోమ?
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Mizoram Election Results 2023: మిజోరంలో బీజేపీ మిత్రపక్ష పార్టీ MNFకి షాక్, మెజార్టీ సాధించిన ZPM
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
/body>