Anirudh Ravichander And Kavya Maran: కావ్యా పాప ఆస్తులెంత ? రజనీకాంత్‌కు అనిరుథ్ ఏమవుతాడు?
Anirudh And Kavya : సంగీత దర్శకుడు అనిరుథ్, సన్ నెట్ వర్క్ వారసురాలు కావ్యా మారన్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వారి ఆస్తులెంతో తెలుసా ?

Anirudh Ravichander To Marry Sunrisers Hyderabad Owner Kavya Maran : తమిళ సెలబ్రిటీలు ఒక్కటి కాబోతున్నారు. మ్యూజిక్ రంగంలో చిన్న వయసులోనే ప్రతిభావంతంగా ఎదిగిన అనిరుథ్ రవిచందర్, సన్ నెట్ వర్క్ వారసురాలు, సన్ రైజర్స్ యజమాని కావ్యామారన్ ప్రేమలో ఉన్నారని తమిళ మీడియా కోడై కూస్తోంది. పెద్దలు కూడా ఒప్పుకున్నారని అంటున్నారు.
కుబేర పుత్రిక కావ్యా మారన్
కావ్యా మారన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ, సహ యజమాని, ఆమె వ్యక్తిగత నెట్ వర్త్ సుమారు 429 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఆస్తి కేవలం ఆమె వ్యక్తిగత ఆస్తి. కావ్యా మారన్ తండ్రి కళానిధి మారన్. సన్ గ్రూప్ చైర్మన్ గా ఉన్నరాు. భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు. ఆయన ఆస్తి రూ. 25,000 కోట్లు ఉంటుందని అంచనా. సన్ గ్రూప్, భారతదేశంలోని అతిపెద్ద మీడియా సంస్థలలో ఒకటి, ఇందులో 33కి పైగా రీజనల్ ఛానెల్స్, వార్తాపత్రికలు, ఎఫ్‌ఎమ్ రేడియో స్టేషన్లు, డిటిహెచ్ సేవలు, సన్ పిక్చర్స్ (ఫిల్మ్ ప్రొడక్షన్), రెండు క్రికెట్ ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్ హైదరాబాద్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఉన్నాయి. కావ్యా మారన్ తల్లి కావేరి మారన్, సన్ టీవీ నెట్‌వర్క్ సీఈఓగా భారతదేశంలో అత్యధిక వేతనం పొందే మహిళా ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు. 2023 జనవరి నాటికి మారన్ కుటుంబం మొత్తం నికర విలువ సుమారు 4 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. కావ్యా సన్ టీవీ నెట్‌వర్క్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, సన్ మ్యూజిక్,సన్ నెక్స్ట్ (OTT ప్లాట్‌ఫాం) వంటి విభాగాలను నిర్వహిస్తున్నారు. కావ్యా మారన్ చెన్నైలోని బోట్ క్లబ్ రోడ్‌లో సుమారు 100 కోట్లు విలువైన లగ్జరీ బంగళాలో నివసిస్తున్నారు. ఈ ఆస్తిని 2001లో HSBC నుండి ఈ-వేలం ద్వారా కొనుగోలు చేశారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB , బెంట్లీ బెంటాయిగా EWB బిఎమ్‌డబ్ల్యూ i7 , ఫెరారీ రోమా , మెర్సిడెస్ మేబాక్ బెంజ్ S660 గార్డ్ వంటి కార్లు ఆమె గ్యాలరీలో ఉంటాయి.
కావ్యా పాపాతో పోలిస్తే అనిరుథ్ నిరుపేద
కావ్యామారన్ వ్యక్తిగత ఆస్తుల తక్కువే ఉండవచ్చు కానీ.. ఆమె కుటుంబ ఆస్తులు లక్ష కోట్లకుపైగా ఉంటాయి. ఆమెను పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతున్న మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచంద్ర ఆస్తులు 50 కోట్లు 100 కోట్ల వరకూ ఉండవచ్చు. అనిరుధ్ ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటాడు. అనిరుధ్ చెన్నైలో 20 కోట్లు విలువ చేసే ఇంట్లో ఉంటారు. ఆయన వద్ద మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ X5 , రేంజ్ రోవర్ స్పోర్ట్ వంటి కార్లు ఉన్నాయి. అనిరుధ్ 2012లో "3" సినిమాలోని "వై దిస్ కొలవరి ఢీ" పాటతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఈ పాట యూట్యూబ్‌లో 450 మిలియన్ వ్యూస్ పొందింది.
రజనీకాంత్ బంధువు అనిరుథ్
అనిరుధ్ రవిచందర్..సూపర్ స్టార్ రజనీకాంత్ కు బంధువు. అనిరుధ్ రవిచందర్ తండ్రి రవి రాఘవేంద్ర నటుడు , సంగీత దర్శకుడు. రవి రాఘవేంద్ర సోదరి లతా రాఘవేంద్ర రజనీకాంత్ భార్య. అనిరుధ్ రవిచందర్ రజనీకాంత్‌కు సమీప బంధువు అనుకోవచ్చు. అనిరుధ్ రజనీకాంత్ నటించిన పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. కావ్యాపాపతో .. అనిరుథ్ పెళ్లి గురించి రజనీకాంత్.. మారన్ కుటుంబంతో మాట్లాడుతున్నారని చెబుతున్నారు.





















