Anirudh Ravichander Wedding: ఐపీఎల్ టీమ్ ఓనర్‌తో అనిరుధ్ పెళ్లి... సోషల్ మీడియాలో వైరల్ టాపిక్
Anirudh Kavya Maran Wedding: యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అదీ ఒక ఐపీఎల్ టీమ్ ఓనర్‌తో ఆయన ఏడు అడుగులు వేయబోతున్నారా?

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర గురించి సినిమా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలకు ఆయన ఫస్ట్ ఆప్షన్ అవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు అనిరుధ్ ఇచ్చే సంగీతానికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి హీరోకు ఆయన హిట్స్ ఇచ్చారు. ప్రొఫెషనల్ కెరీర్ పక్కన పెడితే... అనిరుధ్ పర్సనల్ లైఫ్ చాలాసార్లు వార్తల్లో నిలిచింది. ఫలానా హీరోయిన్‌తో ఆయన డేటింగ్ చేస్తున్నారంటూ వచ్చిన వార్తలు కోకోల్లలు. కానీ ఇప్పుడు ఆయన ఒక ఐపీఎల్ క్రికెట్ టీం ఓనర్ తో డేటింగ్ లో ఉన్నారని న్యూస్ వచ్చింది.
కావ్య పాపతో అనిరుద్ పెళ్లి!?
సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ ఓనర్ ఎవరో తెలుసు కదా!? కావ్య మారన్! సోషల్ మీడియాలో అభిమానులు అందరూ ఆమెను కావ్య పాప అంటారు. అందుకు కారణం రజనీకాంత్! ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి చెందిన సమయంలో స్టేడియంలో కావ్య పాప ఏడవడం చూశానని, తాను అలా ఉండకూడదని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని ఓ సినిమా వేడుకలో రజని అన్నారు. ఆ తర్వాత నుంచి ఆడియన్స్ అంతా ఆవిడను కావ్య పాప అనడం మొదలు పెట్టారు.
ఇప్పుడు ఆ కావ్య పాపతో అనిరుధ్ డేటింగ్ చేస్తున్నారని న్యూస్. ఓ అడుగు ముందుకు వేసిన కొంత మంది... త్వరలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పోస్టులు చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
Also Read: ఘాటీ ఓటీటీ రైట్స్: రేటు యమా ఘాటు... అనుష్క సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ఆఫర్
కావ్య మారన్ వయసు 32 ఏళ్లు. అనిరుధ్ వయసు 34. కావ్య తండ్రి, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కొన్నిటికి అనిరుధ్ సంగీతం అందించారు. ఆయనతో వాళ్ళ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం ఎంత? అనేది ఎవరో ఒకరు ఓపెన్ అయితే తప్ప తెలియదు. ప్రస్తుతానికి అటు సినిమా, ఇటు క్రికెట్ వర్గాలలో హాట్ హాట్ డిస్కషన్ అంటే కావ్య పాపతో అనిరుధ్ పెళ్లి. అదీ సంగతి!





















