Top Headlines: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ, జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో వ్యూహం ఏంటి? - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh News | ఏపీ ఐటీశాఖ మంత్రి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయి పలు కీలక విషయాలపై చర్చించారు. ఏపీకి రావాలని సత్య నాదెళ్లను ఆహ్వానించారు. స్థలం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ- ఏపీకి రావాలని ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ మంత్రి నారా లోకేష్ మైక్రోసాఫ్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న పరిస్థితులు వివరించారు. ఐటీ, స్కిల్‌డెవలప్‌మెంట్‌పై చర్చించారు. డిజిటల్ గవర్నెన్స్‌కు ఐటీ సపోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఏపీ రాజధాని అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా మార్చే ప్రయత్నాల్లో ఉన్నామని దీనికి కూడా సహకారం అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలు
ఆస్తుల వివాదాన్ని రాజకీయం చేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - షర్మిలపై ఎటాక్ వ్యూహాత్మక తప్పిదమేనా ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ అంశంలో స్పేస్ లేకపోయినా టీడీపీని తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నించింది. అయితే ప్రధానంగా తమ ఎటాక్ మాత్రం జగన్ సోదరి షర్మిపైనే గురి పెట్టారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. షర్మిల కూడా వాటికి కౌంటర్ ఇచ్చారు. కానీ ఈ మొత్తం అంశంలో వైఎస్ఆర్‌సీపీ చివరికి వెనక్కి తగ్గింది. పూర్తి వివరాలు
ఫామ్‌హౌస్ కేసులో రాజకీయం ఎక్కువ -మ్యాటర్ తక్కువ ! మానసిక దాడి చేయడమే వ్యూహమా ?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో కుటుంబసభ్యులతో దిపావళీ పార్టీ చేసుకున్నారు. అక్కడ పెద్ద శబ్దాలు చేస్తున్నారని 100కు ఫోన్ వచ్చిందని వెంటనే తనిఖీలు చేశామని పోలీసులు ప్రకటించారు. ఆ తనిఖీల్లో ఫారిన్ లిక్కర్ దొరికిందన్నారు. కానీ డ్రగ్స్ దొరకలేదు. ఆ పార్టీలలో పాల్గొన్న ఓ వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అంతే ఈ వ్యవహారం సంచలనాత్మకం అయింది. అది రేవ్ పార్టీగా ప్రచారం జరిగింది. పూర్తి వివరాలు
కేరళ, హైదరాబాద్‌లో బాణసంచా పేలుళ్లు- ఇద్దరు మృతి 150మందికిపైగా గాయాలు
దీపావళి సందడి నాలుగు రోజులు ముందుగానే దేశవ్యాప్తంగా మొదలైపోయింది. కొత్త వస్తువులు కొంటున్న వాళ్లు కొందరైతే... బంగారం కొనుగోలు చేస్తున్న వారు మరికొందరు. దేశవ్యాప్తంగా బాణసంచా దుకాణాలు భారీగా వెలిశాయి. అక్రమంగా నిల్వచేసిన బాణసంచా ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బాణసంచా పేలుళ్లు కంగారు పుట్టిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే వారితో పాటు చుట్టుపక్కల వారి ప్రాణాలు సైతం గాల్లో కలిసి పోయే ప్రమాదం ఉంది. పూర్తి వివరాలు
ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం- ప్రక్రియ గురించి తెలుసా!
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలకమైన పథకాన్ని ప్రారంభించేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ఫ్రీ సిలిండర్ పథకానికి సంబంధించిన బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళి నుంచి ఉచిత సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే డీఎస్సీ, పింఛన్ల పెంపు హామీలను నెరవేర్చింది. ఇప్పుడు ఫ్రీ సిలిండర్ హామీని నెరవేర్చే దిశగా అడుగు వేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఫ్రీ సిలిండర్ హామీ కీలకమైంది. ఇప్పటి వరకు నిధులు సర్దుబాటు కాకపోవడంతో పథకం అమలును వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తోంది. దీపావళి కానుకగా అర్హులైన వారందరికీ ఉచితంగా సిలిండర్లు ఇవ్వనుంది. పూర్తి వివరాలు