అన్వేషించండి

YSRCP Wrong Track: ఆస్తుల వివాదాన్ని రాజకీయం చేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - షర్మిలపై ఎటాక్ వ్యూహాత్మక తప్పిదమేనా ?

YS Jagan: షర్మిలపై రాజకీయ దాడి వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదం చేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేసుకుని ప్రజల్లో మరింత చులకన అయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Political attack on Sharmila a strategic mistake by YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ అంశంలో స్పేస్ లేకపోయినా టీడీపీని తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నించింది. అయితే ప్రధానంగా తమ ఎటాక్ మాత్రం జగన్ సోదరి షర్మిపైనే గురి పెట్టారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. షర్మిల కూడా వాటికి కౌంటర్ ఇచ్చారు. కానీ ఈ  మొత్తం అంశంలో వైఎస్ఆర్‌సీపీ చివరికి వెనక్కి తగ్గింది. ఇక ఎవరూ మాట్లాడవద్దని తమ పార్టీ నేతలకు సందేశం పంపింది. ఆస్తుల విషయం కోర్టులో ఉంది కాబట్టి అక్కడే వాదనలు వినిపించుకుందామని చెప్పింది. కానీ ఇప్పటి వరకూ జరిగిన రాజకీయంలో జరిగిన డ్యామేజ్‌ను మాత్రం కవర్ చేసుకోవడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

తల్లి, చెల్లి పై కోర్టుకెళ్లడం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలను పంపుతుంది !

వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం ఉందని చాలా మందికి తెలుసు. కానీ ఎప్పుడూ అటు షర్మిల కానీ ఇటు జగన్ కానీ బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రజల్లో చర్చనీయాంశం చేయలేదు. ఏదైనా అంతర్గతంగానే చర్చించుకున్నారు. కానీ ఎప్పుడు అయితే జగన్ తన సోదరి, తల్లిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేశారో.. ఆ విషయం ఎప్పుడు బయటకు తెలిసిందో అదే పెచ్చ సంచలనం అయింది. తల్లి, చెల్లిపై జగన్ కోర్టుకెల్లడం అదీ కూడా గిఫ్ట్ గా ఇచ్చిన ఆస్తుల్ని వెనక్కి తీసుకుంటానని చెప్పడం ఏమిటన్న చర్చ రాష్ట్రమంతటా నడిచింది. దీనిపై వైసీపీ ఏ వాదన వినిపించినా.. తల్లి, చెల్లిని కోర్టుకు లాగిన జగన్ అన్న మాటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లింది. 

జగన్, షర్మిల పంచాయితీకి జడ్జి విజయమ్మే- మాట్లాడే అర్హత వేరే వాళ్లకు లేదు: బాలినేని శ్రీనివాస రెడ్డి

షర్మిలపై ఏకపక్ష దాడితో మరింత డ్యామేజ్

షర్మిల తమ మధ్య ఆస్తుల వివాదం ఉందని ఎప్పుడూ ప్రకటించలేదు. ఎన్సీఎల్టీలో కేసు వేసిన తర్వాత మాత్రమే ఆమె స్పందించారు. వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూండటం.. సాక్షి పత్రికలో జగన్ వాదన వినిపిస్తూ.. షర్మిలదే తప్పు అని ఓ పేజీ కథనం ప్రచురించడంతో ఆమె కూడా తన వాదన వినిపిస్తూ లేఖ విడుదల చేశారు. వైసీపీ నేతలు తర్వాత ప్రెస్‌మీట్లు పెట్టి వరుసగా విమర్శలు చేస్తూండటంతో ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి షర్మిల చంద్రబాబును ఇంప్రెస్ చేయడానికి పసుపుచీర కట్టుకుని వెళ్లారని చేసిన వ్యాఖ్యలతో  వైసీపీ వ్యవహారంపై ప్రజల్లో మరింత నెగెటివ్ చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని గుర్తించి ఇక ఆపేయాలని వైసీపీ నిర్ణయించుకుంది. 

Also Read: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్

సోదరి షర్మిలకు జగన్ ప్రేమతో తన స్వార్జితాన్ని పంచాలనుకున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే తాను జగన్ కోసం వైసీపీ కోసం ఎంత కష్టపడ్డానో  చెబుతున్న షర్మిల తన కోసం ఒక్క సాయం అయినా చేశారో చెప్పాలన్నారు. రాజకీయ పదవుల్ని ఇవ్వలేదు. పార్టీలో పదవుల్ని ఇవ్వలేదు. తనకు రావాల్సిన ఆస్తులు ఇవ్వడానికే ఇబ్బంది పెడుతున్నాని షర్మిల అంటున్నారు. సాధారణంగా మహిళ వైపే సానుభూతి ఉంటుంది. జరుగుతున్న విషయాలతో పాటు ఆమె కన్నీరు పెట్టుకోవడంతో వైసీపీ సానుభూతి పరుల్లోనూ షర్మిలకే అడ్వాంటేజ్ కనిపిస్తోంది. అందుకే వైసీపీ వీలైనంతగా అండర్ ప్లే చేయడానికి డిసైడయింది. 

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget