YSR Pension Kanuka: నేటి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక.. వారికి కూడా అందిస్తామన్న ప్రభుత్వం..
వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 60.80 లక్షల మంది లబ్ధిదారులకు నేటి (అక్టోబర్ 1) నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుకను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల చేతికి పెన్షన్ అందిస్తారని పేర్కొన్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం ఇప్పటికే రూ.1,420.48 కోట్లను విడుదల చేశామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ మొత్తాన్ని పంపిణీ చేశామని వివరించారు. పెన్షన్ అందించడానికి 2.66 లక్షల మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని.. వీరంతా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్లను అందిస్తారని తెలిపారు.
Also Read: అనంతపురం పెన్షన్‌దారుల్లో టెన్షన్.. ఒక్క నెలలో 20 వేల పింఛన్లు ఔట్.. వచ్చే నెలలోనూ ఇంతేనా?
బయోమెట్రిక్, ఐరిస్ అమలు..
లబ్ధిదారుల గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలుచేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. దీంతో పాటుగా ఆర్‌బీఐఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఎవరైనా తమ సొంత నివాసం నుంచి ఇతర ప్రాంతాలకు వైద్యం లేదా ఇతర కారణాలతో 6 నెలలు ఊరు వెళ్లిన వారికి కూడా, వారు ఉండే చోటే పెన్షన్ అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. మూడ్రు రోజుల్లో నూరు శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేలా వాలంటీర్లను ఆదేశించామని చెప్పారు.
Also Read: ఏపీలో సామాజిక పెన్షన్లు తగ్గించేస్తున్నారా..? అసలు నిజమేంటి..?
ఈ-కేవైసీ చేయించుకున్న వారికే రేషన్..
ఏపీలో ఈ-కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే అక్టోబర్ నుంచి రేషన్ ఇవ్వనున్నారు. నమోదు చేయించుకోని పక్షంలో వారికి రేషన్ అందించరు. 5 నుంచి 15 ఏళ్ల లోపు వారికి మాత్రం నెలాఖరు వరకు గడువు పొడిగించినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. ఈ-కేవైసీ లేని వారికి రేషన్ ప్రక్రియ నిలిపి వేసినా.. నమోదు చేయించుకుని వస్తే వెంటనే ఇస్తామని వివరించారు. ఐదేళ్ల లోపు వారికి అవసరం లేదని చెప్పారు. వాలంటీర్ దగ్గర ఉండే మొబైల్ యాప్ ద్వారా నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని సూచించారు.
Also Read: మంత్రి మేకపాటి ఇలాకాలో వైసీపీ వర్సెస్ వైసీపీ.. అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు..
Also Read: కొత్త ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరణ.. ఆదిత్యనాథ్ దాస్‌కు వీడ్కోలు