అన్వేషించండి

Breaking News Live Telugu Updates: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

Background

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగనుంది. ఉదయం పదిన్నరకు అసెంబ్లీ సమావేశాలు ప్రారభమవుతాయి. ఇప్పటి వరకు ప్రొటెం స్పీకర్‌గా ఉన్న అక్బరుద్దీన్.. స్పీకర్‌గా ఎన్నికైన ప్రసాద్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తారు. అనంతర ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి అధికార ప్రతిపక్ష నేతలంతా హాజరుకానున్నారు. ఆయన్ని అభినందించనున్నారు. ఆయన ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడతారు. స్పీకర్‌ ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యేలు మినహా మిగతా పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత సభను వాయిదా వేస్తారు. 
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై చర్చిస్తుంది. ఈ శీతాకాల సమావేశాలను సుమారు 10 రోజుల పాటు నిర్వహించాలని ప్రభత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో రేపు ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణ రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. శాసనసభ, మండలి ఒకేచోట ఉండేలా పార్లమెంట్ తరహా కలిపించేలా మార్పులు చేర్పులు చేయబోతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి పూర్తిగా మార్చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌... పెండింగ్ పనులు పూర్తి చేయాలని సమస్యలు పరిష్కారించాలని అన్నారు. 

నేడు బాధ్యతలు స్వీకరించనున్న మంత్రులు 

ఇప్పటికే  ప్రమాణం చేసిన మంత్రులు రోజువారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఇంతవరకు బాధ్యతలు తీసుకోలేదు. ఇవాళ పలువురు మంత్రులు బాధ్యతలు తీసుకోనున్నారు. 


శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 8 గంటలకు బాధ్యతలు తీసుకుంటారు. దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క  ఉదయం 9 గంటలకు తన ఆఫీస్‌లో అడుగు పెడతారు.

తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు 

మరోవైపు మంచు గడ్డలా మారిపోయిన తెలుగు రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి తీవ్ర విపరీతంగా పెరిగింది. మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. తర్వాత రెండుమూడు రోజులుగ్యాప్ ఇచ్చిన మళ్లీ చలి తీవ్రత పెరుగుతుందని అంటున్నారు. చలిగాలులు కూడా వీటికి జతకలిసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. 

తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటోంది. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత దిగువకు పడిపోయాయి. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మెదక్‌, పటాన్‌చెరు, ఆదిలాబాద్‌, రామగుండంలో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అవుతున్నాయి. నిజామాబాద్‌, హైదరాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, భద్రాచలంలో 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 

10:46 AM (IST)  •  14 Dec 2023

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ - అధికారికంగా ప్రకటించిన ప్రొటెం స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.

10:43 AM (IST)  •  14 Dec 2023

ఎమ్మెల్యేలుగా కేటీఆర్, కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలుగా కేటీఆర్, కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, మొన్న ప్రమాణం చేయని సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Allu Arjun - Chiranjeevi: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
Teacher Transfers: ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
Teacher Transfers: ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
Joe Root Recods: సచిన్ రికార్డు బద్ధలుకొట్టిన జో రూట్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా ఘనత
సచిన్ రికార్డు బద్ధలుకొట్టిన జో రూట్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా ఘనత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Allu Arjun - Chiranjeevi: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
Teacher Transfers: ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
Teacher Transfers: ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల చేసిన విద్యాశాఖ
Joe Root Recods: సచిన్ రికార్డు బద్ధలుకొట్టిన జో రూట్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా ఘనత
సచిన్ రికార్డు బద్ధలుకొట్టిన జో రూట్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా ఘనత
Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Embed widget