Top Headlines Today: టీడీపీ క్యాడర్‌కు చంద్రబాబు గుడ్ న్యూస్ - కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నేటి టాప్ న్యూస్
BRS MLA Joins Congress 13 July 2024: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేటి ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ ఇవీ.
Andhra Pradesh News Today | కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - ఇప్పటివరకూ ఎంతమంది చేరారంటే?
తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్‌కు (BRS) వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరగా.. తాజాగా ఆ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (Arikepudi Gandhi) శనివారం కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గాంధీతో పాటు ఆయన అనుచరులు, పలువురు కార్పొరేటర్లు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైసీపీ హయాంలో నమోదైన అక్రమ కేసుల ఎత్తివేత - పార్టీ క్యాడర్‌కు చంద్రబాబు గుడ్ న్యూస్
వైఎస్ఆర్‌సీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై నమోదైన తప్పుడు కేసులను ఎత్తివేయడానికి అవసరమైన చర్యలను చంద్రబాబు ప్రారంభించారు. తెలుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఐదేళ్ల కాలంలో కేసులను ఎదుర్కొని ఎంతో మంది పార్టీ కోసం పోరాటం చేశారని వారందరిపై వీలైనంత త్వరగా కేసులు ఎత్తివేయాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వారి కాళ్లకు దండం పెడతా - చంద్రబాబు ఎందుకిలా అన్నారు ? ఎవరినుద్దేశించి ?
కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని ఎవరూ అలాంటి పనులు చేయవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇక నుంచి ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు నేను దండం పెడుతానన్నారు. ఇవాళ్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి పుల్‍స్టాప్ పెడుతున్నానని.. తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బీజేపీలో విలీనం దిశగా బీఆర్ఎస్ - పాక్షికంగానా ? పూర్తిగానా ?
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత రాష్ట్ర సమితి పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టతనిస్తున్నాయి. అయితే బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారా లేకపోతే విలీనం అవుతారా .. పూర్తి విలీనమా..లేకపోతే రాజ్యసభ పక్ష విలీననానికే పరిమితమవుతారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కేటీఆర్, హరీష్ రావు దాదాపుగా వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తల్లికి వందనం పథకం ఒక్కరికే ఇస్తారా- ప్రభుత్వం క్లారిటీ ఏంటీ?
తల్లికి వందనం పథకంపై సోషల్‌మీడియా(Social Media)లో జరుగుతోంది తప్పుడు ప్రచారమని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదని...కేవలం గెజిట్ పబ్లికేషన్ మాత్రమే ఇచ్చామని తెలిపింది. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి సోషల్‌మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసిన తరువాత.. ఎన్నికల ప్రచారంలో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు మార్గదర్శకాలలో తల్లికి రూ.15 వేలు అంటూ ఒక్కరికే తల్లికి వందనం వర్తింప జేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి