అన్వేషించండి

Telugudesam : వైసీపీ హయాంలో నమోదైన అక్రమ కేసుల ఎత్తివేత - పార్టీ క్యాడర్‌కు చంద్రబాబు గుడ్ న్యూస్

Nara Chandrababu Naidu : వైసీపీ హయాంలో టీడీపీ క్యాడర్ పై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేసే చర్యలను ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పోస్టులు దక్కుతాయన్నారు.

CM Chandrababu Assures Party Cadre :  వైఎస్ఆర్‌సీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై నమోదైన తప్పుడు కేసులను ఎత్తివేయడానికి అవసరమైన చర్యలను చంద్రబాబు ప్రారంభించారు. తెలుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఐదేళ్ల కాలంలో కేసులను ఎదుర్కొని ఎంతో మంది పార్టీ కోసం పోరాటం చేశారని వారందరిపై వీలైనంత త్వరగా కేసులు ఎత్తివేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం ఏం చేయాలో పార్టీ నేతలకు సూచించారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలపై నమోదైన కేసుల వివరాలను ప్రత్యేక ఫార్మాట్ లో వివరించి .. పార్టీ కార్యాలయానికి పంపించాలని  సూచించారు. అలాగే వైసీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు .. సరిగా స్పందించని పోలీసులు, ఇతర అధికారుల సమాచారం కూడా పంపాలని అన్నారు, అందరిపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుందామని భరోసా ఇచ్చారు. 

మంత్రులు రోజుకు ఇద్దరైనా పార్టీ ఆఫీసుకు రావాలన్న చంద్రబాబు                                 

అధికారంలోకి వచ్చేశాం అనే ఆలసత్వం పార్టీ నేతలు వీడాలని.. మంత్రులు కూడా పార్టీ ఆఫీసుకు రావాలన్నారు. రోజూ ఒకరిద్దరు మంత్రులు అయినా పార్టీ కార్యలయానికి రావాలని సూచించారు. పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండాలని.. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు. మంత్రులు కార్యాలయాలకు వచ్చే  బాధ్యతను ఇంచార్జులు తీసుకోవాలని సూచించారు. మంత్రులు పార్టీ ఆఫీసుకు వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండటం కూడా సేవేనని స్పష్టం చేశారు. 

ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాటు                            

ప్రజల నుంచి వినతులు, విజ్ఞాపనలు స్వీకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలనf ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పార్టీ నేతలు ఎవ్వరూ వ్యక్తిగత దాడులకు, కక్షసాధింపులకు దిగొద్దని  వైసీపీ చేసిన తప్పులే మనం చేస్తే... వారికీ మనకూ తేడా ఉండదని  స్పష్టం చేశారు.  తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దామన్నారు.  

పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు            

పార్టీ కోసం కష్టపడే నాయకులకు పదవులు ఇచ్చే ఏర్పాట్లు చేశామని.. సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన నేతల సమాచారాన్ని పార్టీ ఆఫీసుకు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ఐదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించబోమని..  అందరికీ అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో, పార్లమెంట్ కోఆర్టినేటర్, నియోజకవర్గ పరిశీలకుడితో పాటు ఐవీఆర్ఎస్ ద్వారానూ సమాచార సేకరణ చేస్తున్నామన్నానరు. నివేదికలు త్వరగా పంపాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నారా లోకే,్ కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని..సమస్యలను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు దూరాభారం నుంచి రావొద్దని నారా లోకేష్ సూచించారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget