Chandrababu : వారి కాళ్లకు దండం పెడతా - చంద్రబాబు ఎందుకిలా అన్నారు ? ఎవరినుద్దేశించి ?
Andhra Pradesh : కాళ్లకు దండం పెట్టే సంస్కృతి పోవాలని చంద్రబాబు అన్నారు. ఇక నుంచి ఎవరైనా తన కాళ్లకు మొక్కితే తాను వాళ్ల కాళ్లకు మొక్కుతానన్నారు.
Chandrababu Againes bowing to the feet Culture : కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని ఎవరూ అలాంటి పనులు చేయవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇక నుంచి ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు నేను దండం పెడుతానని ్న్నారు. ఇవాళ్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి పుల్‍స్టాప్ పెడుతున్నానని.. తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదని స్పష్టం చేశారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని పార్టీ నేతలకు సూచించారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి నా నుంచే ప్రారంభిస్తున్నానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కార్యకర్తలను కలుస్తున్న సమయంలో పాద నమస్కారాలు చేస్తున్న వైనం
చంద్రబాబునాయుడు నాలుగో సారిసీఎం అయిన తర్వాత ప్రతీ వారం పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాళ్లకు నమస్కారాలు పెట్టేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. ఇది చంద్రబాబుకు అసౌకర్యం కల్పిస్తోంది. అందర్నీ ప్రతి సారి ఆపలేకపోతున్నారు. ముందుగానే భద్రతా సిబ్బంది.. చంద్రబాబు వద్దకు వెళ్లేటప్పుడే .. కాళ్లకు నమస్కారం పెట్టవద్దని సలహాలు ఇస్తున్నారు. కానీ పార్టీ నేతలు వినడం లేదు. దీంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంది. తన కాళ్లకు నమస్కారం పెడితే తాను తిరిగి మళ్లీ కాళ్లకు నమస్కరిస్తానని అంటున్నారు.
ప్రధాని మోదీ కూడా ఇదే చెస్తున్నారు !
నిజానికి ఇలాంటి సంస్కృతిని నరేంద్రమోదీ ఎప్పుడో తీసుకు వచ్చారు. మోదీ కాళ్లకు నమస్కారం పెట్టేవారు కూడా ఎక్కువగా ఉంటారు. ఆయన పెద్దవారు అయినప్పటికీ.. తన కాళ్లకు మొక్కాల్సిన అవసరం లేదని అలా చేస్తే.. తానే తిరిగి మొక్కుతానని చెప్పేవారు. అలాగే చేస్తున్నారు. ఎవరైనా తన కాళ్లకు మొక్కితే తాను కూడా మొక్కుతున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వారితో అలా చేయించుకోవడం ఇష్టం లేక చాలా మంది .. పాద నమస్కారాలు చేయడం ఆపేస్తున్నారు.
పెద్దలకు పాద నమస్కారం చేసుకోవడం భారతీయ సంప్రదాయం ...కానీ రాజకీయాల్లో మాత్రం వేరే అర్థం !
భారతీయ సంస్కృతికి తల్లిదండ్రుల కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం సంప్రదాయం. అలాగే తమ గురువులను కూడా చాలా మంది అలా గౌరవిస్తూ ఉంటారు. అయితే గౌరవం వేరు.. వయసులో పెద్ద వారిని ఇతరుల్ని గౌరవిస్తే.. రాజకీయాల్లో దురర్థాలు వచ్చేస్తూంటాయి. కొంత మంది దళిత నేతలు తమ పార్టీ అధ్యక్షుడికి కాళ్లు మొక్కితే.. బయట నుంచి విమర్శలు పెరిగిపోతాయి. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండాలని రాజకీయ నేతలు ఓ అభిప్రాయానికి వస్తున్నారు. చంద్రబాబు గట్టిగా చెప్పడంతో ఇక పార్టీ కార్యకర్తలు పాద నమస్కారం చేసే ప్రయత్నాలను మానుకుంటారని భావిస్తున్నారు.