Ananat Ambani Wedding: అంబానీ పెళ్లిలో యోగా గురు రామ్‌దేవ్ బాబా స్టెప్పులు, అనంత్‌తో కలిసి డ్యాన్స్ - వీడియో
Ananat Ambani Wedding Celebrations: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో యోగా గురు రామ్‌దేవ్ బాబా డ్యాన్స్ వేసిన వీడియో వైరల్ అవుతోంది.
Anant Ambani Radhika Merchant Wedding: యోగా గురు రామ్ దేవ్ బాబా స్టెప్పులేశారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి హాజరైన ఆయన..కాసేపు సరదాగా గడిపారు. అనంత్ అంబానీతో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు. యోగాసనాలు వేస్తూ కనిపించే రామ్ దేవ్ బాబా ఇలా స్టెప్పులేయడం ఇదే తొలిసారి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్‌లు ఈ వీడియోకి ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పెళ్లికి ఆయనతో పాటు ఆచార్య బాలకృష్ణ కూడా వచ్చారు.
View this post on Instagram
జులై 12వ తేదీన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఒక్కటయ్యారు. ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వివాహం జరిగింది. ప్రపంచ దేశాలకు చెందిన కీలక నేతలతో పాటు ఫేమస్ సింగర్స్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులూ సందడి చేశారు. శుక్రవారం ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. రాత్రి వివాహం పూర్తైంది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సూపర్ స్టార్ రజినీ కాంత్ స్టెప్పులేసిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. ఈ వెడ్డింగ్‌కి వచ్చిన సినీ ప్రముఖులంతా ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. స్పెషల్ డ్రెస్‌లతో మెరిశారు.
View this post on Instagram