Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్‌లు, ఈ సారి మరింత భారీగా!
Amazon Layoffs: అమెజాన్‌లో 18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది.
Amazon Layoffs:
18 వేల మందికి ఉద్వాసన..?
ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్‌లో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిన ఈ సంస్థ...మరోసారి భారీ స్థాయిలో లేఆఫ్‌లకు సిద్ధమవుతోంది. అంతకు ముందు కన్నా ఎక్కువ మొత్తంలో ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం...గతేడాది నవంబర్ నుంచి ఈ కోతలు కొనసాగుతున్నాయి. అయితే...మరో 10 వేల మందిని తొలగించనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ...ఇప్పుడా సంఖ్య ఏకంగా 18 వేలకు పెరిగింది. సంస్థ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా...కచ్చితంగా ఇంత మందని తొలగిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలోని సియాటెల్‌లోని కంపెనీలో దాదాపు 10 వేల మందిని తొలగించేందుకు ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకుంది అమెజాన్. రిటెయిల్, హెచ్‌ఆర్ విభాగంలోని ఉద్యోగులను ఇంటికి పంపనుంది. కొవిడ్ సంక్షోభ సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ పెరిగింది. అప్పుడు వేలాది మంది ఉద్యోగులను అదనంగా రిక్రూట్ చేసుకుంది కంపెనీ. అయితే...ఇప్పుడు బిజినెస్ డల్ అవడం వల్ల వారి అవసరం లేదని భావిస్తోంది. అందుకే....క్రమంగా వారిని తొలగిస్తూ వస్తోంది. గతేడాది లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌కు 16 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 18 వేల మందిని తొలగిస్తారని తెలుస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఉద్యోగం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అయితే...ఇలా ఉన్నట్టుండి పంపుతున్నందుకు పరిహారం కూడా చెల్లిస్తోంది కంపెనీ.
లేఆఫ్‌ల ట్రెండ్..
టెక్ సెక్టార్‌లో లేఆఫ్‌లు కంటిన్యూ అవుతున్నాయి. ట్విటర్‌తో మొదలైన ఈ ట్రెండ్...అన్ని కంపెనీల్లోనూ నడుస్తోంది. అంతకు ముందు అమెజాన్‌లో 20 వేల మందిని తొలగిస్తారంటూ వార్తలు వినిపించాయి. టెక్నాలజీ స్టాఫ్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ సహా మరి కొన్ని విభాగాల్లోని ఉద్యోగులను తొలగించనుంది అమెజాన్. మరి కొద్ది నెలల్లోనూ వీరందరినీ ఇంటికి పంపేయనుంది. గతంలోనే అమెజాన్ సీఈవో యాండీ జాసీ "భారీ లేఆఫ్‌లు" ఉంటాయని వెల్లడించారు. కానీ..ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం చెప్పలేదు. సీనియర్ పొజిషన్‌లో ఉన్న వారినే "ఫైర్" చేయనుంది అమెజాన్. ఉద్యోగులక పనితీరుని సమీక్షించాలని..ఇప్పటికే మేనేజర్లకు ఆదేశాలందాయి. ఈ రివ్యూ అయిపోయిన వెంటనే...లేఆఫ్‌లు మొదలు కానున్నాయి. కార్పొరేట్ స్టాఫ్‌లో 6% మందిని తొలగించనున్నారు. కార్పొరేట్ స్టాఫ్‌లో కొంత మందికి ఇప్పటికే "లేఆఫ్" కు సంబంధించిన సమాచారం ఇచ్చేశారు. 24 గంటల్లోగా కంపెనీ నుంచి వెళ్లిపోయేలా అన్నీ సిద్ధం చేశారు. రిలీవింగ్ ప్యాకేజ్ అందించి ఇంటికి పంపడమే మిగిలింది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఉద్యోగులందరిలోనూ టెన్షన్ మొదలైంది. నిజానికి...ఫలానా విభాగంలోనే ఉద్యోగులను తొలగించాలన్న నియమం ఏమీ పెట్టుకోలేదు అమెజాన్. ఎక్కడ వర్క్‌ఫోర్స్ అనవసరం
అనుకుంటే...అక్కడ తొలగించుకుంటూ వెళ్లనుంది. అయితే...ఈ రీలైన్‌మెంట్ స్కీమ్‌ను అందరిపైనా బలవంతంగా రుద్దలేదని, ఉద్యోగుల ఇష్టప్రకారమే అది జరుగుతుందని తేల్చి చెప్పారు అమెజాన్ ప్రతినిధి. తాము ఇచ్చిన ప్యాకేజీ నచ్చిన వాళ్లే ఆ మొత్తం తీసుకుని స్వచ్ఛందంగా రాజీనామా చేశారని స్పష్టం చేశారు.
Also Read: Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌కు అదనపు CRPF బలగాలు, ఇక ఉగ్రవాదుల ఆటకట్టు!