Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌కు అదనపు CRPF బలగాలు, ఇక ఉగ్రవాదుల ఆటకట్టు!
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌కు కేంద్రం అదనపు సీఆర్‌పీఎఫ్ బలగాలను తరలిస్తోంది.
CRPF in Jammu and Kashmir:
18 వందల మంది..
జమ్ముకశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో మళ్లీ ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. రాజౌరి జిల్లాలో జరిగిన దాడిలో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగానే...18 వందల మంది అదనపు CFPF బలగాలను రంగంలోకి దించనుంది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో వీరిని మొహరించనున్నారు. ANI తెలిపిన వివరాల ప్రకారం...CRPFకి చెందిన 18 కంపెనీల బలగాలు రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అదనపు బలగాలతో ఉగ్రవాదంపై పోరాడటం మరింత సులువవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే 9 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు రాజౌరికి చేరుకున్నాయి. మిగతా
బలగాలు ఢిల్లీ నుంచి వెళ్లనున్నాయి. వీరంతా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీని తీవ్రంగా విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఈ విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. రోజురోజుకీ జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జమ్ము ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలబడ్డారని...కానీ వారికి రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
Amid attacks on civilians, Centre to deploy 18 additional CRPF companies in J-K
— ANI Digital (@ani_digital) January 4, 2023
Read @ANI Story | https://t.co/djFdg2QAPM#CRPF #JammuAndKashmir #civiliankilling #TerrorAttack #Terrorists pic.twitter.com/Ol15DJAxMR
ఉగ్రదాడిలో ఆరుగురు మృతి..
ఇటీవల రాజౌరీలో ఉగ్రదాడి జరగ్గా ఓ చిన్నారితో పాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల ఘటనలో సాధారణ పౌరులు చని పోవడంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. డంగ్రీలోని మెయిన్ చౌక్‌లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ సమయంలోనే బాంబు పేలుడు సంభవించింది. " అధికారులు, పోలీసులు దాడులు జరగకుండా ఆపడంలో విఫలమయ్యారు. లెఫ్ట్‌నెంట్
గవర్నర్ మనోజ్ సిన్హా ఇక్కడికి రావాలి. మా డిమాండ్‌లు వినాలి" అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడిపై మనోజ్ సిన్హా స్పందించారు. ఉగ్ర చర్యను ఖండించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. అయితే..ఈ ఘటనతో స్థానికులు నిరసన వ్యక్తమవుతోంది. కిశ్‌త్వర్ జిల్లాలో ఓ రోజు పూర్తిగా బంద్ పాటించారు. అన్ని షాప్‌లను మూసివేశారు. జమ్ముకశ్మీర్‌లో చాలా చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల సీఆర్‌పీఎఫ్ బలగాలు కార్డన్ సెర్చ్ చేపడుతున్నారు. అనుమానాస్పద వాహనాలను ఎక్కడికక్కడే నిలిపి వేస్తూ తనిఖీ చేస్తున్నారు.