Sonia Gandhi Hospitalised: రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ, ఢిల్లీకి రాహుల్ ప్రియాంక
Sonia Gandhi Hospitalised: శ్వాసకోశ సమస్యలతో సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు.
Sonia Gandhi Hospitalised:
ఇన్‌ఫెక్షన్..
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్‌లో రొటీన్ చెకప్ కోసం వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రియాంక గాంధీ కూడు సోనియా వెంట వెళ్లారు. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో సోనియా బాధ పడుతున్నారు. రెండు రోజులుగా ఆమె కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చారు. ప్రస్తుతం యూపీలో భారత్ జోడో యాత్రలో వీళ్లిద్దరూ బిజీగా ఉన్నారు. 7 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగాక...దానికి బ్రేక్ ఇచ్చి ఢిల్లీకి వచ్చారు. "సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. చెస్ట్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌లో ఆమెకు చికిత్స అందిస్తున్నాం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ వచ్చింది" అని గంగారాం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ వెల్లడించారు. గతేడాది జూన్‌లోనూ సోనియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ సోకిన తరవాత కూడా చాలా రోజుల పాటు ఆమెను ఏదో ఓ సమస్య వెంటాడింది. కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాక డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలే ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి కొంత దూరం నడిచారు సోనియా గాంధీ. సోనియా...ఈ యాత్రలో పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్‌లో కర్ణాటకలో యాత్ర జరిగినప్పుడు రాహుల్, ప్రియాంక గాంధీతో కలిసి నడిచారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 1998 నుంచి 2017 వరకు సోనియా పనిచేశారు. 2019 నుంచి బుధవారం వరకు ఆమె పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగారు. 1991లో తన భర్త రాజీవ్ గాంధీ మరణించే సమయానికి సోనియా గాంధీ రాజకీయాలకు దూరంగా ఉండేవారు. కానీ, పరిస్థితుల ప్రభావం కారణంగా 1997లో తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ మరుసటి ఏడాదే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
ఇటీవలే వ్యవస్థాపక దినోత్సవం..
ఇటీవలే కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా సోనియా గాంధీ,రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. ఇంత జరుగుతున్నా...కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. "భారతీయ స్ఫూర్తిపైనే కేంద్రం దాడి చేస్తోంది. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోసింది. అందుకే ప్రతిపక్షాలు అలా ఆందోళనకు గురవుతున్నాయి. జోడో యాత్రకు వచ్చిన మద్దతు చూసి వాళ్లు తట్టుకోలేకపోతున్నారు" అని వ్యాఖ్యానించారు ఖర్గే. పదేపదే యాత్రను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 1855లో బాంబే వేదికగా డిసెంబర్ 28న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భవించింది. దాదాబాయ్ నౌరోజీ, దిన్షా వచా పార్టీని స్థాపించగా...మిగతా కార్యకలాపాలాన్నీ వుమేష్ చంద్ర బెనర్జీ చూసుకున్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక INC పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.
Also Read: UP News: డెలివరీ చేశాడు, కడుపులో టవల్ మర్చిపోయి కుట్లు వేశాడు - యూపీలో ఓ వైద్యుని నిర్వాకం