Onion garlic Divorce: ఉల్లి, వెల్లుల్లి వద్ద గొడవ - 11 ఏళ్ల బంధానికి విడాకులు -ఇలా కూడా ఉంటున్నారు
Ahmedabad couple : అహ్మదాబాద్ దంపతుల మధ్య ఉల్లిపాయ-వెల్లుల్లి వివాదం ఏర్పడింది. చివరికి అది 11 సంవత్సరాల వివాహానికి ముగింపు పలికింది.

Ahmedabad couple dispute over onion garlic ends in divorce : విడాకులు తీసుకోవడానికి ఇప్పుడు పెద్ద పెద్ద కారణాలేం అక్కర్లేదు. అల్లం, వెల్లుల్లిని కూడా కారణంగా చూపి విడిపోవచ్చు. దానికి సాక్ష్యం ఈ అహ్మదాబాద్ జంట. అహ్మదాబాద్‌కు చెందిన దంపతులు మధ్య 11 సంవత్సరాల వివాహాన్ని కేవలం అల్లం , వెల్లుల్లి కారణంగానే ముగించేశారు.స్వామినారాయణ సంప్రదాయాన్ని పాటించే భార్యకు ఈ మసాలాలు నిషేధం కాగా, భర్త , అతడి కుటుంబానికి మాత్రం మసాలాలు ఇష్టం. ఈ అంశంపై తరచూ వివాదాలు వస్తూ ఉన్నాయి. చివరికి ఆ వివాదం కోర్టుకు చేరింది.
2002లో అహ్మదాబాద్‌లోని సంప్రదాయక కుటుంబాల మధ్య వియ్యం కుదిరింది. దంపతుల మధ్య మొదట్లో అన్ని సాధారణంగా సాగాయి. భార్య స్వామినారాయణ సంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించేవారు. ఈ సంప్రదాయంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి మసాలాలు నిషేధం. కానీ భర్త , అతడి కుటుంబం ఈ మసాలాలను రోజువారీ ఆహారంలో వాడుకుంటున్నారు. వివాహం తర్వాత ఇది తీవ్ర సమస్యగా మారింది.
కుటుంబంలో భోజన వంటలో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకం గురించి భార్య తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కుటుంబ సభ్యులు విడివిడిగా భోజనం తయారు చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ వివాదం క్రమంగా పెరిగి, భార్య ఇంటి నుంచి వెళ్లిపోయారు. 2013లో భర్త అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టును సంప్రదించి, భార్య ఆహార అలవాట్లపై రాజీ కాకపోవడం 'మానసిక హింస' క్రూరత్వంగా పరిగణించి విడాకులు కోరారు. ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను ఆమోదించి విడాకులు మంజూరు చేసింది.
భార్య ఈ తీర్పును సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టుకు అప్పీల్ చేశారు. డివిజన్ బెంచ్ డిసెంబర్ 2025లో విచారణ జరిపి, అప్పీల్‌ను తిరస్కరించింది. కోర్టు తీర్పులో ఆహార అలవాట్లు, మతపరమైన విశ్వాసాలు వివాహ జీవితంలో ముఖ్యమైనవి. ఇలాంటి విభేదాలు క్రమంగా పెరిగి మానసిక హింసగా మారవచ్చు అని పేర్కొంది. భర్త వాదనల ప్రకారం, భార్య రాజీ కాకపోవడం వల్ల కుటుంబ జీవితం అసాధ్యమైందని, ఇది క్రూరత్వం కు సమానమని హైకోర్టు అంగీకరించింది.
अहमदाबाद में तलाक का एक अजीबोगरीब मामला सामने आया है, जहां खाने में प्याज और लहसुन डालने को लेकर एक कपल के बीच बहस इतनी बढ़ गई कि शादी के 11 साल बाद ही मामला तलाक तक पहुंच गया I #Gujarat #Divorce #CourtNews #viralpost2025シ #RoyalPatrika pic.twitter.com/UTBSmOvVHI
— Royal Patrika (@PatrikaRoyal) December 9, 2025
ఈ తీర్పు భారతీయ వివాహ చట్టం (హిందూ మ్యారేజ్ యాక్ట్, 1955)లోని సెక్షన్ 13(1)(ఐబి) ప్రకారం 'క్రూరత్వం'ను ఆధారంగా చేసుకుని జారీ చే చేశారు. వివాహం కేవలం భావోద్వేగాలపై కాకుండా, రోజువారీ జీవితంలో సామరస్యంపై ఆధారపడి ఉంటుంది అని కోర్టు స్పష్టం చేసింది.





















