Parliament Budget Session : ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేసే చాన్స్ - బడ్జెట్ సమావేశాల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం
Parliament Budget Session : శీతాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన 146 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తి వేయనున్నారు.
Suspension Of Opposition MPs To Be Revoked : లోక్‌సభ, రాజ్యసభల్లో సస్పెండ్ అయిన ఎంపీలకు గుడ్ న్యూస్ రానుంది. వారిపై సస్పెన్షన్లు ఎత్తివేసేందుకు ప్రివిలేజ్ కమిటీకి ప్రభుత్వం నుంచి సూచనలు వెళ్లాయి. ప్రస్తుత పార్లమెంట్ చివరి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఈ సమావేశాల్లో ప్రతిపాదించనున్నారు. చివరి సమావేశాలు కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత సమావేశాల సందర్భంగా సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష సభ్యులందరి సస్పెన్షన్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ లోక్ సభ, రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. సస్పెన్షన్ కు గురైన ఎంపీలు తిరిగి సమావేశాలకు హాజరడం ద్వారా నిర్మాణాత్మక చర్చలకు అనువైన వాతావరణాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.
#WATCH | When asked about the revocation of suspended MPs, Parliamentary Affairs Minister Pralhad Joshi says, "All (suspensions) will be revoked. I have spoken with the (Lok Sabha) Speaker and (Rajya Sabha) Chairman, I have also requested them on behalf of the government...This… pic.twitter.com/F9xWqohPYg
— ANI (@ANI) January 30, 2024
శీతాకాల సమావేశాల్లో సభ్యుల సస్పెన్షన్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పుడు లోక్‌సభ (Lok Sabha)లో దుండగులు చొరబడ్డారు. ఈ ఘటనతో పార్లమెంట్ (Parliament) దద్దరిల్లింది. డిసెంబరు 13 న ఈ ఘటన జరిగింది. నాటి ఈ భద్రతా వైఫల్యం (Security Breach)పై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి.ఎంతకీ వినక పోవడంతో ఉభసభల నుంచి సభ్యులను సస్పెండ్ చేసారు. ఉభయ సభల నుండి ఏకంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసారు. వీరిలో 132 మందిని "మిగిలిన సెషన్" వరకు సస్పెండ్ చేశారు. లోక్‌సభకు చెందిన ముగ్గురు ఎంపీలు, రాజ్యసభకు చెందిన 11 మంది ఎంపీలను సంబంధిత హౌస్ ప్రివిలేజెస్ కమిటీల నివేదిక పెండింగ్‌లో ఉంచింది. ఇప్పుడు ప్రభు్త్వమే వారి సస్పెన్షన్లను ఎత్తి వేయాలని కోరుతూండటంతో.. వారంతా మళ్లీ సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు
జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ సమర్పించనున్నారు. ఫిబ్రవరి 9న సమావేశాలు ముగుస్తాయి. ఈ చివరి సమావేశాలు కావడంతో అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పించడం, ఎంపీలందరూ పాల్గొనేలా చూడటంపై దృష్టి సారించారు. రాష్ట్రపతి ప్రసంగం, ఓట్ ఆఫ్ అకౌంట్స్ పై చర్చలకు వీలు కల్పించే ప్రణాళికలతో ఈ సమావేశాల్లో సమగ్రంగా పాల్గొనేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్యసభ ప్రివిలేజెస్ ప్యానెల్ ప్రతినిధి మాట్లాడుతూ ఎంపీలందరినీ చర్చల్లో పాల్గొనేందుకు అనుమతిస్తామని, రాష్ట్రపతి ప్రసంగాన్ని గౌరవిస్తామని అంటున్నారు. సస్పెన్షన్ల ఎత్తివేత నిర్ణయం మరింత సహకారాత్మకంగా .. బడ్జెట్ సమావేశాలు పార్లమెంటరీ చర్చకు, చర్చలకు కీలక అవకాశాన్ని కల్పిస్తాయని అంచనా వేస్తున్నారు.