News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Adar Poonawalla: కొవిడ్‌పై భయం అక్కర్లేదు, వ్యాక్సినేషన్‌లో మన ట్రాక్ రికార్డ్ తెలుసుగా - అదర్ పూనావాలా

Adar Poonawalla: భారత్ ప్రజలు కరోనా కేసులపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని సీరమ్ సీఈవో అదర్ పూనావాల్‌ అన్నారు.

FOLLOW US: 
Share:

 Adar Poonawalla on Covid: 

ఆందోళన చెందొద్దు: అదర్ పూనావాలా

చైనాలో మరోసారి కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. దాదాపు నెల రోజులుగా అక్కడ కొవిడ్ వ్యాప్తి అనూహ్యంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ జీరో కొవిడ్ పాలసీతో కఠిన ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. అయితే...దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడం వల్ల వెంటనే వాటిని సడలించింది. అప్పటి నుంచి మళ్లీ బాధితుల సంఖ్య పెరుగుతూ పోతోంది. అయితే..చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్రభావం మిగతా దేశాలపైనా పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. కేంద్రఆరోగ్య మంత్రి నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా...భారత్ ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. "భారత్‌లో వ్యాక్సినేషన్ కవరేజ్ రికార్డు స్థాయిలో ఉంది. భయపడాల్సిన పని లేదు" అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ప్రజలకు సూచించారు. "చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న వార్తలు కాస్త ఆందోళన కలిగిస్తున్న మాట నిజమే. కానీ...మన దేశంలో వ్యాక్సినేషన్‌ కవరేజ్ చాలా బాగుంది. అందుకే భయపడాల్సిన పని లేదు. భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంచాలి. జాగ్రత్తలూ పాటించాలి" అని ట్వీట్ చేశారు అదర్ పూనావాలా.  

చైనాలో తీవ్రం..

చైనాలో కఠినమైన కొవిడ్ -19 ఆంక్షలను సడలించిన తరువాత.. వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే నెలల్లో చైనాలో మిలియన్లకు పైగా మరణాలను సంభవించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న కేసులతో చైనాలోని ఆసుపత్రులు కిటకిటలడుతున్నాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలోని 60 శాతానికి పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫెఇగ్ల్ -డింగ్ అంచనా వేశారు. ఎరిక్ సోమవారం ట్విట్టర్‌లో ఒమిక్రాన్ వేరియంట్ గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉందని.. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి 16 మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఎపిడెమియాలజిస్ట్ అంచనా ప్రకారం 60 శాతానికి పైగా చైనా ప్రజలు, అంటే 10 శాతం భూ జనాభా వచ్చే 90 రోజుల్లో వైరస్‌కు గురవుతారు. మరణాల సంఖ్య మిలియన్లలోనే ఉంటుందని తెలిపారు. చైనా తన కరోనా కట్టడి నిబంధనలను ఇలానే సడలిస్తే మిలియన్ కంటే ఎక్కువ మంది మరణించే ప్రమాదం ఉందని ఓ అమెరికా సంస్థ పేర్కొంది. మరోవైపు యూఎస్, దక్షిణ కొరియా, బ్రెజిల్‌లో కూడా కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు రావడంతో.. భారత్‌లో కరోనావైరస్ పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేశారు.

Also Read: Bharat Jodo Yatra: మంత్రిగారూ మీరు ముందు ప్రధానికి లేఖ రాయండి - మన్‌సుక్‌పై గహ్లోట్ ఫైర్

Published at : 21 Dec 2022 02:18 PM (IST) Tags: Adar Poonawalla India China COVID-19 cases Adar Poonawalla on Covid

ఇవి కూడా చూడండి

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

ABP Desam Top 10, 28 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 28 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Rythu Bandhu News: రైతుబంధు ఎవరివల్ల నిలిచింది? పోలింగ్ రోజు రైతన్న దెబ్బ బీఆర్ఎస్‌కా? కాంగ్రెస్‌కా?

Rythu Bandhu News: రైతుబంధు ఎవరివల్ల నిలిచింది? పోలింగ్ రోజు రైతన్న దెబ్బ బీఆర్ఎస్‌కా? కాంగ్రెస్‌కా?

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

టాప్ స్టోరీస్

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

KCR Election Campaign: హైదరాబాద్‌ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్‌ మీటింగ్

KCR Election Campaign: హైదరాబాద్‌ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్‌ మీటింగ్

Kriti Sanon : బన్నీతో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా: కృతిసనన్

Kriti Sanon : బన్నీతో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా: కృతిసనన్

Kangana Ranaut: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?

Kangana Ranaut: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?