By: Ram Manohar | Updated at : 15 Mar 2023 01:17 PM (IST)
అదానీ అంశంపై విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈడీ కార్యాలయానికి ర్యాలీ చేస్తున్నారు. (Image Credits: ANI)
Opposition MPs Rally:
రెండో విడత పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి రాజకీయాలు మరింత వేడెక్కాయి. అదానీ అంశంపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టు పడుతున్నాయి. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్‌లను కేంద్రం పట్టించుకోడం లేదని, మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తోందని మండి పడుతున్నారు నేతలు. ఈ క్రమంలోనే పార్లమెంట్ నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలందరూ ఈడీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదానీ అంశంపై విచారణ జరపాలని మెమొరాండం సమర్పించేందుకు వెళ్తున్నారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సెక్షన్ 144 అమల్లో ఉందని, ఎంపీలెవరూ ర్యాలీ చేయడానికి వీల్లేదని తేల్చి చెబుతున్నారు. ఇక్కడ ఆందోళనలు చేపట్టడం కుదరదంటూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రతిపక్ష ఎంపీలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ర్యాలీ కొనసాగిస్తున్నారు. అయితే ఈ ర్యాలీలో ఎన్‌సీపీ సహా తృణమూల్ నేతలు పాల్గొనడం లేదు.
#WATCH | Delhi: Opposition MPs begin their march from Parliament to ED office to submit a memorandum over Adani issue. pic.twitter.com/AEMd2Zx0vJ
— ANI (@ANI) March 15, 2023
#WATCH | Delhi: Police make announcements at Vijay Chowk and inform the marching Opposition MPs to not march ahead as Section 144 CrPC is imposed and no agitation is allowed here.
— ANI (@ANI) March 15, 2023
The MPs are marching from Parliament to ED office. pic.twitter.com/cZ5FpIl6Zy
ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. అదానీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
"17, 18 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలందరి డిమాండ్ ఒకటే. కేవలం రెండున్నరేళ్లలో అదానీ అంత డబ్బు ఎలా సంపాదించారు..? మమ్మల్ని ఇలా రోడ్డుపైనే ఆపేశారు. మేమంతా కలిపితే 200 మంది ఉన్నాం. మమ్మల్ని అడ్డుకోవడానికి 2 వేల మంది పోలీసులను పంపారు. మా గొంతుని అణిచివేసేందుకు చూస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేసే వ్యక్తులకు ప్రధాని మోదీ అండగా ఉంటున్నారు. అదానీ అంశంపై తప్పక విచారణ జరిపించాలి. ప్రధానికి, అదానికి మధ్య రిలేషన్ ఏంటో చెప్పాలి. ఈడీ డైరెక్టర్ ని కలిసి మెమొరాండం ఇచ్చేందుకు వెళ్తున్న మమ్మల్ని కేంద్రం అడ్డుకుంటోంది. "
మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
We all MPs from 17-18 political parties are here & we want to know how Adani made Lakhs and Crores of rupees within 2.5 years. They have stopped us here. We are 200 and there are 2000 Police personnel here, so they want to suppress our voices: Congress chief Mallikarjun Kharge pic.twitter.com/7gGqr7kNWo
— ANI (@ANI) March 15, 2023
Govt is giving money to one man to purchase govt properties. PM is encouraging someone who had less assets earlier but now expanded to Rs 13 Lakhs Crores worth of assets. How did it happen? Who is responsible? Who is giving the money? There should be inquiry. What is the relation… https://t.co/iXntNEc92s pic.twitter.com/vkFgGNNIm2
— ANI (@ANI) March 15, 2023
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్