ABP Southern Rising Summit 2024 : మంత్రుల ఫోన్లు సీఎం ట్యాప్ చేస్తున్నారు - రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా ? - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సవాల్
ABP Southern Rising Summit KTR : సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి లై డిటెక్ట్ టెస్టుకు రావాలని సవాల్ చేశారు.
KTR accused CM Revanth Reddy of tapping the phones of ministers : ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు.తమ హయాంలో అసలు ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని స్పష్టం చేశారు. మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయించకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే లైడిటెక్టర్ టెస్టుకు రావాలని సవాల్ చేశారు. ట్యాపింగ్ చేయించలేదని తామ చెబుతున్నామని రేవంత్ రెడ్డి కూడా వస్తే ఇద్దరికీ ఇక్కడే లైడిటెక్టర్ టెస్టులు నిర్వహించినా సిద్ధమేనని సవాల్ చేశారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుుత్వం ఓ డిజాస్టర్ గా మారిందని కేటీఆర్ అన్నారు. అక్కడ స్కాం జరిగింది... ఇక్కడ స్కాం జరిగిందని ప్రచారం చేయడం తప్ప ఎక్కడా ఒక్క సాక్ష్యం తో కూడా ఆరోపణ కూడా చేయలేదన స్పష్టం చేశారు. అటెన్షన్ టెవర్షన్ చేస్తూ పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలోనూ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆయారాం గయారాం అనే సంస్కృతిని తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. దేశంలో ్నఅనేక సమస్యలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల వల్ల బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు.
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
ఉద్యమ పార్టీలు తమ లక్ష్యాన్ని సాధించిన తర్వాత నిలబడలేవని ఆయా పార్టీల నాయకత్వంలో అహంకారం పెరిగిపోవడం వల్ల ఆయా పార్టీలు వేగంగా పతనమవుతాయన్న అభిప్రాయాన్ని కేటీఆర్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కూడా స్వాతంత్య్ర ఉద్యమం నుంచే ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఎన్నో ఉద్యమ పార్టీలు సుదీర్ఘ కాలం నుంచి ఉన్నాయన్నారు. అదే సమయంలో తమ పార్టీ ఉద్యమ పార్టీ మాత్రమే కాదు.. అంతకు మించి అన్నారు. కేసీఆర్ ఉద్యమకారుడే కాదు మంచి వ్యూహాత్మక రాజకీయ వేత్త అని ఓ సారి అరుణ్ జైట్లీ ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
జనాభాను తగ్గించడం వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణాదిలో జనాభా పెరుగుదల రేటు తగ్గిపోవడం అనేది నిజమని.. మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు సిద్ధంగా లేరన్నారు. జీవన ఖర్చులు పెరుగుతున్నందున ఎక్కువ మంది పిల్లల కోసం ప్రజలు ఆసక్తి చూపించడం లేదని తెలిపారు. దక్షిణాదిలో ఫ్యామిలీ ప్లానింగ్ మంచి విజయం సాధించిందన్నారు. అయితే స్టాలిన్, చంద్రబాబు జనాభాను పెంచాలని పిలుపునిస్తున్నారు కానీ.. మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తున్న అంశాలపై వారు సరైన స్పష్టతకు రావడం లేదన్నారు. దీనికి ఇప్పటికిప్పుడు ఇన్‌స్టంట్ సొల్యూషన్ లేదని స్పష్టం చేశారు.
కేటీఆర్ ఇంటర్యూ పూర్తి లింక్‌ను ఇక్కడ చూడవచ్చు.