AAP Vs BJP: ప్రతిపక్షాలపై అటాక్ పూర్తయ్యాక ప్రశాంతంగా నిద్రపోండి, ప్రధానిపై ఆప్ ఎంపీ సెటైర్
AAP Vs BJP: దర్యాప్తు సంస్థల సోదాలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.

AAP Vs BJP:
సంజయ్ సింగ్ విమర్శలు..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. దర్యాప్తు సంస్థల్ని తమకు నచ్చినట్టుగా వాడుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండి పడుతున్నాయి. ముఖ్యంగా ఆప్ నేత సిసోడియాను అరెస్ట్ చేయడపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఆ పార్టీ. ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ప్రతిపక్షమే లేకుండా చేసి అప్పుడు మోదీ ప్రశాంతంగా నిద్రపోతారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా ఈ సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ నాదో సలహా అంటూ ట్వీట్ చేశారు.
"ప్రధాని మోదీకి నాదో సలహా. ప్రతిపక్షాలపై ఈ దాడులు చేసి అసలు అపోజిషన్ అనేదే లేకుండా చూసుకోండి. ఆ తరవాత 8 గంటల పాటు నిద్రించండి. అప్పుడు ప్రతిపక్షమూ ఉండదు. దేశంలో ప్రజాస్వామ్యమూ ఉండదు. కేవలం నియంతృత్వం ఒకటే మిగులుతుంది"
- సంజయ్ సింగ్, ఆప్ ఎంపీ
वैसे मेरा एक सुझाव था।
— Sanjay Singh AAP (@SanjayAzadSln) March 11, 2023
अगर विपक्ष के सारे नेताओं का “एनकाउण्टर” करवा दिया जाय।
तो कम से कम मोदी जी सुकून से 8 घंटे सो पायेंगे।
न विपक्ष रहेगा न लोकतंत्र।
बचेगी तो सिर्फ़ तानाशाही।
ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న మనీశ్ సిసోడియా దర్యాప్తు సంస్థలను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. తనను జైల్లో ఉంచినంత మాత్రాన ఆత్మస్థైర్యం కోల్పోను అని తేల్చి చెప్పారు.
"మీరు నన్ను జైల్లో పెట్టి వేధించొచ్చు. కానీ నా ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఏమీ చేయలేరు. స్వాతంత్ర్య సమర యోధులనూ బ్రిటిషర్లు ఇలాగే వేధించారు. కానీ వాళ్ల సంకల్పం చెదరలేదు"
-మనీశ్ సిసోడియా
साहेब जेल में डालकर मुझे कष्ट पहुँचा सकते हो,
— Manish Sisodia (@msisodia) March 11, 2023
मगर मेरे हौसले नहीं तोड़ सकते,
कष्ट अंग्रेजो ने भी स्वतंत्रता सेनानियों को दिए,
मगर उनके हौसले नहीं टूटे।
- जेल से मनीष सिसोदिया का संदेश
దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఈడీ కోర్టులో హాజరు పర్చింది. అయితే సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ సంచలనాలు బయటపెట్టింది. హైదరాబాద్ కేంద్రంగానే దిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందని తెలిపింది. కొంతమంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా నిపుణుల కమిటీ అభిప్రాయాలను అంగీకరించకుండా ఈ మద్యం విధానాన్ని రూపొందించారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఆప్ సీనియర్ నేత సిసోడియాకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ న్యాయవాది తెలిపారు. ఈ విధానంలో తాము ఎంపిక చేసిన హోల్సేల్ వ్యాపారులు 12 శాతం ప్రాపిట్ మార్జిన్ వచ్చే విధంగా పాలసీని రూపొందించినట్లు ఈడీ తెలిపింది. ఇది ఉండాల్సిన దానికంటే ఆరు శాతం ఎక్కువ ఉందని వెల్లడించింది."మనీశ్ సిసోడియా ఆదేశాల ప్రకారమే ఇది జరిగిందని మా వద్ద సమాచారం ఉంది. మద్యం అమ్మకానికి లైసెన్స్ ఇవ్వడానికి నిర్ణయించిన వ్యవస్థను కూడా ఉల్లంఘించారు. కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులు దాని నుంచి ప్రయోజనం పొందారు" అని ED తెలిపింది.
Also Read: Land-For-Job Case: తేజస్వీ యాదవ్ సతీమణికి అనారోగ్యం, సీబీఐ విచారణకు హాజరు కాలేనని వెల్లడి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

