Karnataka Hindi Issue : బెంగళూరు బ్యాంకులో హిందీ వివాదం - మేనేజర్,కస్టమర్ ఏ భాషలో వాదులాడుకున్నారంటే ?
Kannada: కన్నడ అంశంపై బెంగళూరులో ఓ బ్యాంక్ మేనేజర్, కస్టమర్ వాదులాటకు దిగారు. తాను కన్నడ మాట్లాడబోనని బ్యాంక్ మేనేజర్ గట్టిగా చెప్పారు.

Kannada issue in Bengaluru : తమిళనాడుతో పాటు కర్ణాటకలోనూ తరచూ హిందీ భాష పై వివాదం రేగుతూనే ఉంటుంది. బెంగళూరులో ఉండేవారంతా కన్నడ నేర్చుకోవాలని అక్కడి ఉద్యమసంఘాలు డిమాండ్ చేస్తూంటాయి. అయితే బెంగళూరు గ్లోబల్ సిటీ కావడంతో కన్నడ వచ్చినవాళ్లు తక్కువగా ఉంటారు. సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇతర చోట్ల నడిచిపోతుంది కానీ.. బ్యాంకుల వంటి చోట్ల మాత్రం తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
బెంగళూరు రూరల్‌లోని చందాపురలో ఉన్న SBI సూర్య నగర్ బ్రాంచ్ లో ఓ కస్టమర్ బ్యాంక్ మేనేజర్‌తో కన్నడలో మాట్లాడాలని కోరాడు, మహిళా మేనేజ కన్నడలో మాట్లాడడానికి నిరాకరించారు. "ఇది ఇండియా, నేను హిందీలోనే మాట్లాడతాను" అని వాదించారు. కస్టమర్ రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
I WILL NOT SPEAK KANNADA IN KARNATAKA, NEVER, SPEAK IN HINDI.
— ಗುರುದೇವ್ ನಾರಾಯಣ್ 💛❤️ GURUDEV NARAYAN🌿 (@Gurudevnk16) May 20, 2025
@TheOfficialSBI Branch manager SBI, surya nagara, anekal taluk KARNATAKA
Your Branch manager and staff disrespect the Kannada language, imposing hindi on people of karnataka, misbehaving with customers,on duty times… pic.twitter.com/drD7L6Dydb
తన వాదనలో కస్టమర్ RBI మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో స్థానిక భాషలో సేవలు అందించాలని నిబంధన ఉందని వాదించాడు. అయినప్పటికీ, మేనేజర్ తన వాదనకే కట్టుబడ్డాడు. ఈ ఘటనను హైలైట్ చేస్తూ, SBI సిబ్బంది కన్నడ భాషను అగౌరవపరిచారని, హిందీని రుద్దుతున్నారని, RBI నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని సోషల్ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు. కొంత మంది కన్నడలో మాట్లాడాలని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారని ప్రశ్నించారు.
Why the Kannda guy forcing her to speak in Kannda, when Kannda speaking staff already standing there? If he has any grievances, unable to speak in English or Hindi, then speak to any Kannda speaking staff. Why making a fuss without any issue? Constitution provides fundamental…
— TradeInbox (@TradeInboxIN) May 20, 2025
కర్ణాటక రక్షణ వేదిక (KRV) వంటి ప్రో-కన్నడ సంస్థలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, మే 21న బెంగళూరులోని SBI హెడ్ ఆఫీస్ వద్ద మరియు చందాపుర బ్రాంచ్ వద్ద రెండు ఏకకాల ప్రదర్శనలు నిర్వహించారు. వారు SBI సిబ్బంది కన్నడ-మాట్లాడే కస్టమర్లను అగౌరవిస్తున్నారని, స్థానిక భాషలో సేవలు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై విస్తృత విమర్శలు రావడంతో, SBI అధికారిక ప్రకటన విడుదల చేసింది. "సూర్య నగర్ బ్రాంచ్‌లో జరిగిన ఇటీవలి సంఘటనపై మేము లోతైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఈ విషయం పూర్తిగా విచారణలో ఉంది. కస్టమర్ల భావోద్వేగాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే ఏ ప్రవర్తననైనా సహించే విధానం మాకు లేదు" అని SBI తెలిపింది.. కన్నడ మాట్లాడేది లేదని వాదించిన మేనేజర్ ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.





















