News
News
X

Best Verdicts Laws In India: భారత్‌లో చరిత్రాత్మక చట్టాలు, తీర్పులు - అవేంటంటే?

దేశ చరిత్రలో ఎన్నో విప్లవాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయి. వాటితో పాటు కొన్ని కీలక కేసుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులూ చరిత్రాత్మకంగా నిలిచిపోయాయి.

FOLLOW US: 

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ భారత్‌లో ఎన్నో చట్టాలు వచ్చాయి. వాటిలో కొన్ని దేశ గతినే మార్చేశాయి. మరికొన్ని దేశ ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా ఓ సారి అవేంటో చూద్దాం. 

భారత్‌లో అమలైన కీలక చట్టాలివే 

1. 1976లో ఓ కీలక చట్టం అమల్లోకి వచ్చింది. అదే వెట్టిచాకిరీ నిర్మూలనా చట్టం. ఓ వ్యక్తి వద్ద అప్పు తీసుకుంటే, ఆ అప్పు తీర్చేంత వరకూ వెట్టి చాకిరీ చేయాల్సి వచ్చేది. ఈ కారణంగా కొందరు జీవితాంతం అలా కొందరికి ఊడిగం చేస్తూనే ఉండేవారు. ఈ హింసను భరించలేక కొందరు ప్రాణాలు కూడా విడిచారు. ఈ సమస్యకు పరిష్కారంగానే వెట్టిచాకిరీ నిర్మూలనా చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. అప్పు చెల్లించాలనే సాకుతో పని చేయించుకునే వారు శిక్షార్హులు అని అప్పటి ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

2. 1950ల్లో వచ్చిన అత్యంత ముఖ్యమైన చట్టాల్లో హిందూ కోడ్ బిల్స్ ఒకటి. హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మైనార్టీ అండ్ గార్డియన్‌షిప్ యాక్ట్, హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటేనెన్స్ యాక్ట్..ఈ వరుసలో ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం... అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా నిర్ధరించగా, అబ్బాయిలకు 21 ఏళ్లుగా నిర్ణయించారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి అంగీకారంతోనే పెళ్లి జరగాలని స్పష్టం చేసింది హిందూ మ్యారేజ్ యాక్ట్. అయితే ఇది కేవలం ఓ వర్గానికి సంబంధించి చేసిన చట్టం వల్ల అప్పట్లో కాస్త వివాదాస్పదమైంది. అయితే ఇటీవల అమ్మాయిలకు కనీస వివాహ వయసు 21 ఏళ్లకు పెంచింది కేంద్రం. 

3. భారత్‌లో అమల్లోకి వచ్చిన అత్యంత కీలకమైన చట్టాల్లో విద్యాహక్కు చట్టం ఎంతో ప్రత్యేకం. విద్య అనేది భారత పౌరుల ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పింది. "ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిపుచ్చుకోవటం భారత్‌లోని ప్రతి పౌరుని హక్కు" అని ఆ చట్టం తేల్చి చెప్పింది. 6-14 మధ్య వయసున్న పిల్లలందరూ కచ్చితంగా స్కూల్‌లో అడ్మిషన్ తీసుకుని చదువుకోవాలని నిబంధన విధించింది. 

4. క్రిమినల్‌ లా అమెండ్‌మెంట్ యాక్ట్-2013లో భాగంగా అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్ష పెంచారు. 20ఏళ్లకు తగ్గకుండా నేరస్థులకు శిక్ష పడేలా చేయటంతో పాటు, ఆ శిక్షను పొడిగించి జీవితకాల ఖైదునీ అమలు చేసేలా క్రిమినల్‌లా లో సవరణలు చేశారు. అవసరమైతే మరణశిక్షకూ వెనకాడొద్దని తేల్చి చెప్పింది ఈ చట్టం. 

5. మహిళా హక్కులకు ప్రాధాన్యతనిచ్చేలా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను నేరంగా పరిగణిస్తారు. మూడుసార్లు తలాక్ చెప్పి ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులు ఇవ్వటం నేరం. ఒకవేళ అలా విడాకులు పొందిన మహిళ ఫిర్యాదు చేస్తే.. ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం కల్పించింది ఈ చట్టం. 

6. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము, కశ్మీర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని 2019లో అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా జమ్ము, కశ్మీర్‌ను విడగొట్టి జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. స్థానిక భూములపై స్థానికులకే హక్కు ఉండేలా ఈ చట్టం అవకాశం కల్పించింది. కశ్మీరీ యువతకు ఉపాధి అవకాశాలు చూపించటం సహా, ఆ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అణిచివేయటమే తమ లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది. 

సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పులు 

ఇక రాజ్యాంగాన్ని అనుసరించి భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎన్నో చారిత్రక తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పులు తర్వాతి రోజుల్లో ఎన్నో కేసులకు పాఠ్యాంశాలుగా మారాయి. అలాంటి చారిత్రక తీర్పులను ఓసారి చూద్దాం. 

1. ఏకే గోపాలన్ Vs మద్రాస్ రాష్ట్రం, 1950
ఏకే గోపాలన్ ఓ కమ్యూనిస్టు లీడర్. 1950లో ముందస్తు నిర్బంధ చట్టం (Preventive Detention Law) కింద ఆయనను మద్రాస్ జైలులో పెట్టారు. అప్పుడు రాజ్యంగంలోని ఆర్టికల్ 32 ఆధారంగా హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసి తన నిర్బంధాన్ని ఏకే గోపాలన్ సవాల్ చేశారు. సెక్షన్లు 7, 8, 10, 11, 12, 13, 14లు ఆర్టికల్ 13, 19, 21లను అతిక్రమిస్తున్నాయని ఆయన వాదించారు. 

తీర్పు


ఈ తీర్పు సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ఒక స్వతంత్ర కోడ్ అని సుప్రీంకోర్టు పేర్కొంది. సిస్టమ్ రూపొందించిన చట్ట వ్యవస్థ కింద గోపాలన్‌ను నిర్బంధించారని తెలిపింది. ఒక వేళ చట్ట ప్రకారం రూపొందించిన వ్యవస్థ ద్వారా వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ నిర్బంధించినప్పుడు ఆ వ్యవస్థ ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించినట్టు కాదని స్పష్టం చేసింది.

అంతేకాదు, సెగ్మెంట్ 14ను సుప్రీంకోర్టు తొలగించింది. ఇది కీలక హక్కులను ఉల్లంఘిస్తున్నదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. ఆ రిట్ పిటిషన్‌ను తొలగిస్తూ ఏకే గోపాలన్ నిర్బంధం చట్టబద్ధమేనని చారిత్రక తీర్పును ఇచ్చింది.

2. కేశవానంద భారతి Vs కేరళ, 1973
భారత న్యాయవ్యవస్థలో కేశవానంద భారతి కేసును చాలా ప్రత్యేకంగా పేర్కొంటారు. 1970లో ఈ పిటిషన్ ఫైల్ అయింది. ఎదినీర్ మఠానికి కేశవానంద భారతి మఠాధిపతి. కేరళ, కాసర్‌గోడ్‌లో ఈ మఠం ఉంది. అయితే ఆయన పేరు మీద ఆయన కొన్ని భూములను కొనుగోలు చేశారు. అదే సమయంలో అప్పటి కేరళ ప్రభుత్వం భూసంస్కరణల చట్టం 1969ని అమలు చేసింది. దీంతో ఆయన కేసు పెట్టారు.

తీర్పు

ఈ కేసును 13 మంది న్యాయమూర్తులతో కూడిన అతిపెద్ద సుప్రీం ధర్మాసనం విచారించింది. 7-6 రేషియోతో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు రాజ్యాంగం మౌలిక స్వభావం, దాని సుస్థిరత్వానికి బీజాలు వేసింది.

పార్లమెంటు చట్టం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించడానికి అర్హమేనని పేర్కొంది. ప్రాథమిక హక్కులు సహా అన్నింటిని పార్లమెంటు సవరించగలదని తెలిపింది. అయితే ఏ సవరణ చేసినా రాజ్యాంగ మౌలిక స్వభావం, దాని ప్రాథమిక నిర్మాణం కోల్పోకుండా ఉండాలని వివరించింది. ఈ నిర్మాణాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా కూడా మార్చలేరని తన చారిత్రక తీర్పులో స్పష్టం చేసింది. 


౩. ఎస్ఆర్ బొమ్మై Vs కేంద్ర ప్రభుత్వం, 1994
జనతా దళ్ ప్రభుత్వంలో కర్ణాటకకు ఎస్ఆర్ బొమ్మై 1988 ఆగస్టు 13 నుంచి 1989 ఏప్రిల్ 21 వరకు సీఎంగా చేశారు. 1989 ఏప్రిల్ 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ పాలనను ఆర్టికల్ 356ను ఉటంకిస్తూ రాష్ట్రపతి నిలిపేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తెచ్చారు.

ఇది సాధారణంగా ప్రతిపక్షాల ప్రభుత్వాన్ని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వేసే ఎత్తుగడ వంటిది. దీంతో రాష్ట్ర గవర్నర్‌ ఆదేశాలను వ్యతిరేకిస్తూ తమ ప్రభుత్వాన్ని తొలగించడాన్ని సవాల్ చేస్తూ బొమ్మై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కానీ, కర్ణాటక హైకోర్టు ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

తీర్పు

ఈ పిటిషన్‌ను తొమ్మిది మంది సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. 1994 మార్చి 11న సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే పూర్తి అధికారం రాష్ట్రపతికి ఉండదని సుప్రీం కోర్టు తేల్చింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి తన అధికారాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని వివరించింది. అప్పటి వరకు రాష్ట్ర శాసన సభను సస్పెండ్ చేసే అధికారం మాత్రమే రాష్ట్రపతికి ఉంటుందని తెలిపింది. 

Also Read: Women Freedom Fighters : బ్రిటిష్ వారికే దడ పుట్టించిన మహిళా స్వాతంత్ర్య సమరయోధులు - వీరి గురించి ఎక్కువ మందికి తెలియదు ! ఇవిగో వారి విశేషాలు

Published at : 10 Aug 2022 08:58 PM (IST) Tags: Independence Day Azadi ka Amrit Mahotsav Independence Day 2022 Best of Bharat people Best verdicts and Laws

సంబంధిత కథనాలు

Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

శివసేన గుర్తుపై ఉద్ధవ్ థాక్రే సమాధానం కోరిన ఎన్నికల సంఘం

శివసేన గుర్తుపై ఉద్ధవ్ థాక్రే సమాధానం కోరిన ఎన్నికల సంఘం

టాప్ స్టోరీస్

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

T20 world cup 2022: కోహ్లీ టు కార్తీక్ అంతా సగం అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమైన వాళ్లే

T20 world cup 2022: కోహ్లీ టు కార్తీక్ అంతా సగం అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమైన వాళ్లే